Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్

Continues below advertisement

ఐపీఎల్ టాప్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్యాక్-టు-బ్యాక్ షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవలే సిఎస్కే హెడ్ కోచ్‌ గా తప్పుకొని ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్ ఫ్లెమింగ్, ఇప్పుడు తన టీమ్ ను కూడా ఇంగ్లాండ్ వైపు లాగేందుకు స్కెచ్ వేశాడు.

ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ బాధ్యతల కోసం సిఎస్కే బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా లెజెండ్ మైకేల్ హస్సీని ఫ్లెమింగ్ కాంటాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈసీబీ నుంచి ఇంకా ఆఫిసిఅల్ ఆఫర్ లెటర్ రాకపోయినప్పటికీ, ఫ్లెమింగ్ ఫస్ట్ ఛాయిస్ మాత్రం 51 ఏళ్ల హస్సీనే. 

2008 నుంచి ఐపీఎల్‌లో ప్లేయర్లుగా, కోచ్‌లుగా కలసి పనిచేస్తున్న వీరికి 15 ఏళ్ల అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లోనే సిఎస్కే ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. కేవలం హస్సీ మాత్రమే కాదు, సిఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న ఎరిక్ సిమన్స్‌ను కూడా ఇంగ్లాండ్ బౌలింగ్ కోచ్‌గా తీసుకెళ్లేందుకు ఫ్లెమింగ్ ప్లాన్ చేస్తున్నాడు. మొత్తం మీద సిఎస్కే కోచింగ్ కోర్ స్టాఫ్‌ను ఇంగ్లాండ్ టీమ్‌లోకి మార్చేందుకు ఫ్లెమింగ్ వేసిన ప్లాన్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola