ABP PV Sindhu Exclusive Interview: ఇది నాకూ..దేశానికీ చాలా గర్వకారణమైన విషయం
Continues below advertisement
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకం విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఏబీపీ దేశంలో మాట్లాడారు.
- రెండు ఒలంపిక్ మెడల్స్ సాధించడంపై మీ స్పందన ఏంటి..?
'ఇది నాకూ..దేశానికీ చాలా గర్వకారణమైన విషయం
ఇది అంత తేలికైన విషయం కాదు. పోటీ బాగా పెరిగింది. అంచనాలు ఎక్కువుగా ఉన్నాయి. - మీరు గెలుచుకున్న షటిల్ ఉంది.. ఎంత కష్టం అయింది గెలవడానికి ..?
గడచిన ఐదేళ్లుగా నేను తీవ్రంగా శ్రమిస్తున్నాను. కరోనా వల్ల ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇబ్బంది ఎదురైంది. ఈ విషయంలో ప్రభుత్వం, బాడ్మింటన్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకరించాయి. - ప్రేక్షకులు లేకపోవడం లోటుగా ఫీలయ్యారా..?
కచ్చితంగా... పాండమిక్ కారణంగా ఈసారి ప్రేక్షకులు లేరు. కానీ పరోక్షంగా వాళ్లంతా నన్ను చూస్తున్నారని.. మద్దతు ఇస్తున్నారనీ నాకు తెలుసు. వారందరికీ కృతజ్ఞతలు - పారిస్ టోర్నమెంట్ ప్రణాళికలు.. అంచనాలు ఏంటి..
ప్రస్తుతం ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నాను. పారిస్ కోసం సిద్ధమవుతున్నా.. నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా - సెమిస్ లో ప్రవేశించిన మన హాకీ జట్లకు ఏం మెసేజ్ ఇస్తారు..
రెండు జట్లనూ నేను అభినందిస్తున్నాను. వాళ్లకి ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా అమ్మాయిల జట్టు ఆస్ట్రేలియాతో అదరగొట్టింది.
Continues below advertisement