Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒక  సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అతనే ప్రఫుల్‌ హింగే. కేవలం 30 లక్షల బేస్ ప్రైజ్ కు అమ్ముడైన ఈ కుర్రాడు తన మొదటి మ్యాచ్‌లోనే రాజస్థాన్ వంటి బలమైన జట్టును గడగడలాడించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే బంతిని అందుకున్న హింగే, తన తొలి ఓవర్‌లోనే ముగ్గురు కీలక బ్యాటర్లను సున్నా పరుగులకే పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించాడు. 

ఆ తర్వాత తన రెండో ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌ రియాన్ పరాగ్‌ను కూడా అవుట్ చేసి మొత్తం అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ప్రఫుల్ హింగే మైదానంలో వికెట్లు తీస్తుంటే, సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్‌ సంఖ్య రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు అతని ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కేవలం  3 వేల మంది ఫాలోవర్స్‌ మాత్రమే ఉండేవారు. క్రికెట్ అభిమానులకు అతని పేరు కూడా తెలియదు. కానీ, అతను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు అందుకునే సమయానికి ఆ సంఖ్య 1.61 లక్షలకు చేరింది. 

ఈ సోషల్ మీడియా క్రేజ్‌ కేవలం లైకులు, కామెంట్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది ప్రఫుల్‌ హింగే ఆర్థిక స్థితిగతులను కూడా ప్రభావితం చేస్తోంది. మార్కెటింగ్ ఏజెన్సీల అంచనాల ప్రకారం, ప్రఫుల్ ఇప్పుడు నానో ఇన్‌ప్లుయెన్సర్‌ స్థాయి నుంచి మిడ్ టైర్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కేటగిరిలోకి ప్రవేశించాడు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola