IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం

ఐపీఎల్ 2026 సీజ‌న్ లో చెన్నై  సూప‌ర్ కింగ్స్ వ‌రుస‌గా రెండో విజ‌యంతో స‌త్తా చాటింది. చెన్నైలో జ‌రిగిన మ్యాచ్ లో మూడుసార్లు చాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పై 32 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 192 ప‌రుగులు చేసింది. 

ఓపెన‌ర్ క‌మ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ 32 బంతుల్లో 48 పరుగులు చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఆయుష్ మాత్రే, బ్రెవిస్ మంచి ఇన్నింగ్స్ ఆడి.. CSK స్కోర్ బోర్డు ను పెంచేరు. సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే అంతగా రాణించలేదు.  

అనంత‌రం ఛేద‌న‌లో ఓవ‌ర్ల‌న్నీ ఆడిన కేకేఆర్ 7 వికెట్ల‌కు 160 ప‌రుగులు మాత్ర‌మే చేసి, ఓడిపోయింది. కెప్టెన్ అజింక్య ర‌హానే వ‌న్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగి అంతగా రాణించలేదు. సూప‌ర్ ఫామ్ లో ఉన్న అంగ్ క్రిష్ ర‌ఘువంశీ తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాన్ని ర‌హానే నెల‌కొల్పాడు. కానీ వరుసగా వికెట్స్ పడడంతో KKR క‌ష్టాల్లో ప‌డింది. కాసేప‌టికే రింకూ సింగ్, కామెరూన్ గ్రీన్ డ‌కౌట్ కావ‌డంతో కేకేఆర్ ఆశలు ఆవిరి అయిపోయ్యాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola