Pakistan vs Sri Lanka Asia Cup 2025 | డూ ఆర్ డై మ్యాచ్ లో స‌త్తా చాటిన పాక్

ఈ సంవత్సరం ఎలాగైనా ఆసియాక‌ప్ గెలవాలనుకున్న శ్రీలంకకు మళ్ళి ఛాన్స్ మిస్ అయింది. గ‌త ఎడిష‌న్ లో ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన శ్రీలంక ఈ టోర్నమెంట్ లో పాక్ చేతిలో 5 వికెట్లతో పరాజ‌యం పాలైంది. సూప‌ర్- 4 మ్యాచ్ లో ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక తమ బ్యాటింగ్ వైఫ‌ల్యంతో 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 133 ప‌రుగులు చేసింది. ఆల్ రౌండ‌ర్ క‌మిందు మెండిస్ 50 రన్స్ చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్ షాహిన్ షా ఆఫ్రిదికి మూడు వికెట్లు ద‌క్కాయి. 

134 పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ చేజ్ మొదలుపెట్టింది. మొదటి వికెట్ కు 45 పరుగులు చేసింది. కానీ 57 రన్స్ కు 4 వికెట్లకు పడిపోయింది. తీక్షణ రెండు వికెట్లు తీశాడు. హసరంగ రెండు వికెట్లు తీసి, ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దాంతో పాకిస్తాన్ ఒత్తిడికి గురైంది. కానీ హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్ భాగస్వామ్యం జట్టును మళ్లీ గేమ్‌లోకి తెచ్చింది. తలత్, నవాజ్ కలిసి మంచి భాగస్వామ్యం జోడించారు. శ్రీలంక బౌలింగ్‌ను ఎదుర్కొంటూ నెమ్మదిగా స్కోరు పెంచారు. చివరికి 18 ఓవర్లలో 138 రన్స్ చేసి పాకిస్తాన్ విజయాన్ని సాధించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola