Abrar Ahmed vs Wanindu Hasaranga Asia Cup 2025 | అహ్మద్ vs హసరంగా
ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ చేసిన పనికి.. శ్రీలంక ఆల్రౌండర్ హసరంగ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే శ్రీలంక ప్లేయర్ హసరంగా వికెట్ తీశాడు పాకిస్తాన్ బౌలర్ అబ్రార్. వికెట్ తీయగానే హసరంగా స్టైల్ లో అబ్రార్ సెలెబ్రేట్ చేసుకున్నాడు. హసరంగా పెవిలియన్ కు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ కు వచ్చింది. అప్పుడు శ్రీలంక బౌలర్ హసరంగా వరుసగా పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా, అయూబ్ వికెట్ పడగొట్టాడు. ముఖ్యంగా ఆయుబును క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత తన స్టైల్ లో పెవిలియన్ లో కూర్చున్న పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ కు కౌంటర్ ఇచ్చాడు హాసరంగా. వికెట్ తీసినప్పుడు అబ్రార్ చేసే సెలెబ్రేషన్స్ ను హసరంగా గ్రౌండ్ లో చేసి చూపించాడు. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత వీరిద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకొని హాగ్ చేసుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా ఇది కదా అసలైన స్పోర్ట్స్ మ్యాన్ షిప్ అని కామెంట్స్ చేస్తున్నారు.