Arjun Tendulkar vs Samit Dravid | సమిత్ ద్రవిడ్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్
భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ చెరగని ముద్ర వేశారు. ఆ ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచ్‌లను గెలిపించారు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి కుమారులు ప్రత్యర్థులుగా మారి క్రికెట్ ఆడుతున్నారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న డాక్టర్ తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్‌లో సచిన్, ద్రవిడ్ కొడుకులు మైదానంలో తలపడ్డారు. అర్జున్ టెండూల్కర్, సమిత్ ద్రావిడ్ డాక్టర్ తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్ లో అపోజిట్ టీమ్స్‌లో ఆడుతున్నారు.
గోవా తరఫున ఆడిన అర్జున్ టెండూల్కర్, కేఎస్‌సీఏ సెక్రటరీస్ ఎలెవన్ తరఫున ఆడిన సమిత్ ద్రావిడ్‌ను అవుట్ చేశాడు. సమిత్ 26 బంతుల్లో 9 పరుగులు చేసి అవుటయ్యాడు. అర్జున్ వేసిన బంతికి కాశబ్ బాక్లే క్యాచ్ పట్టడంతో సమిత్ అవుట్ అయ్యాడు. గోవా తరఫున ఆడుతూ బౌలర్‌గా మాత్రమే కాకుండా బ్యాటర్‌గా కూడా రన్స్ చేస్తూ అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. ఈ మ్యాచ్ ను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అంతా తెగ సంబరపడిపోతున్నారు.