గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
పాకిస్తాన్ ఆటగాళ్లే కాదు.. ఆ దేశ జనాల్లో కూడా చాలావరకు వంకరబుద్ధి ఎదవలే ఉంటారేమో. తాజాగా గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఓ పాకిస్థానీ చేసిన పనితో ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే మాట అంటోంది. ప్రస్తుతం టీమిండియా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్‌కి ముందు ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ కావడంతో ఆటగాళ్లలో కొందరు అడిలైడ్ చక్కర్లు కొట్టారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Captain Shubman Gill) కూడా హర్షిత్ రాణాతో కలిసి బయటకు వెళ్లాడు. అదే సమయంలో ఓ వ్యక్తి గిల్ దగ్గరకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
గిల్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకెళ్లిపోయాడు. అయితే షేక్ ఇచ్చిన వెంటనే ఆ సదరు వ్యక్తి.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై సదరు పాకిస్తాన్ ఫ్యాన్‌ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ‘పాకిస్తాన్ ఆటగాళ్లే అనుకున్నాం.. పాకిస్తాన్‌లో ఉండే ప్రతి ఒక్కరిదీ చెత్త బుద్ధేనా?’ అంటూ తిట్టిపోస్తున్నారు.
ఆసియా కప్ సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లకి టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కాబట్టే.. సదరు పాకిస్తానీ కావాలని షేక్‌హ్యాండ్ ఇవ్వడమే కాకుండా.. వెంటనే పాకిస్తాన్ జందాబాద్ అని అరిచాడని.. అయితే గిల్ మాత్రం.. అతడు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసినా పట్టించుకోకుండా హుందాగా వెళ్లిపోయాడంటూ ఫ్యాన్స్ గిల్‌ని అభినందిస్తున్నారు. అలాగే.. మ్యాచ్‌లు గెలవడం చేత కాదు కదా.. అందుకే ఇలా వంకర బుద్ధితో బిహేవ్ చేసి.. అదే వాళ్లు సాధించిన అతిపెద్ద అచీవ్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నాడు.. అంటూ ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్.