New Zealandతో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైట్.. టీమ్‌లో కీలక మార్పులు
women's ODI world cup 2025 టోర్నీలో గురువారం New Zealandతో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైట్‌కి రెడీ అవుతోంది టీమిండియా. హ్యాట్రిక్ ఓటములతో పాయింట్స్ టేబుల్లో నాలుగో ప్లేస్‌కి పడిపోయిన టీమిండియా సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. అందుకే ఈ మ్యాచ్ కోసం టీమ్ కాంబినేషన్స్‌లో కూడా కీలక మార్పులు చేయాలని డిసైడ్ అయిందట కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకున్న టీమిండియా.. బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను పక్కన పెట్టి ఆమె స్థానంలో రేణుకా సింగ్‌ను తీసుకుంది. అయినా మ్యాచ్‌లో ఓడిపోవల్సి వచ్చింది.
దీంతో జెమీమాను పక్కన పెట్టాలనే హర్మన్ డెసిషన్‌ని చాలామంది తప్పుబట్టారు. అందుకే ఈ మ్యాచ్‌లో జెమీమాని మళ్లీ టీమ్‌లోకి తీసుకోవాలని అనుకుంటోందట టీమ్ మేనేజ్‌మెంట్. దీనివల్ల బ్యాటింగ్ డెప్త్ పెరిగి ఎక్కువ పరుగులు చేసే చాన్స్ ఉండటమే కాకుండా.. మ్యాచ్ జరిగే నవీ ముంబై పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం.. డ్యూ ప్రభావం ఉండే ఛాన్స్ ఉండటంతో.. టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగితే మిడిలార్డర్ మరింత బలంగా మారి ఎక్కువ పరుగులు చేసే ఛాన్స్ ఉంటుందని అనుకుంటోందట. అయితే మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలుండే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఇక ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.