Pakistan Cancelled Press Meet Asia Cup 2025 | ప్రెస్ మీట్ రద్దు చేసిన పాకిస్తాన్
ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్ భారత్ తో మరోసారి తలపడబోతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ వేదికగా జరిగే భారత్, పాక్ మ్యాచ్ కు ముందు నిర్వహించే ప్రెస్ మీట్ ను పాకిస్తాన్ రద్దు చేసింది. ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్‌లో ఇరు జట్ల కెప్టెన్‌లు పాల్గొనాల్సి ఉంటుంది.
పాకిస్తాన్ ఇలా మ్యాచ్ కు ముందు విలేకరుల సమావేశాన్ని ఎందుకు రద్దు చేసింది అనేది ఎవరికీ తెలియదు. దీనిపై అధికారిక ప్రకటన కూడా రాలేదు. ఆసియాకప్‌లో మ్యాచుకు ముందు పాకిస్థాన్ ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు చేయడం ఇది రెండోసారి. యూఏఈతో మ్యాచుకు ముందు కూడా పాక్ ఇలానే చేసింది. షాక్ హ్యాండ్, మ్యాచ్ రిఫరీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ జరిగే మ్యాచ్ కు కూడా ఆండీ ప్రైకాఫ్ట్ రెఫరీగా ఉండనున్నారు. షాక్ హ్యాండ్, మ్యాచ్ రిఫరీ వివాదం కారణంగానే పాకిస్తాన్ ఇలా ప్రెస్ మీట్ ను రద్దు చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి.