India vs Pakistan Preview Asia Cup 2025 | దాయాదుల పోరుకు రంగం సిద్దం

ఆసియా కప్ లో మరోసారి ఇండియా పాకిస్తాన్ తలపడనున్నారు. ఇంకా హ్యాండ్ షేక్, మ్యాచ్ రిఫరీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ రెండు టీమ్స్ కు ఇది కీల‌క మైన మ్యాచ్. కాబ‌ట్టి పూర్తి స్థాయి టీమ్ తో బ‌రిలోకి దిగనున్నాయి. స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి తిరిగి ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ ఉంది. 

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో పాక్ కంటే టీమిండియా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. ఓపెనర్లుగా శుభ‌మాన్ గిల్, అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగుతారు. మిడిలార్డ‌ర్ లో కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌, ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబే, వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ ఆడే అవకాశం ఉంది. ఒమ‌న్ తో మ్యాచ్ లో త‌ల‌కు గాయం కావ‌డంతో అక్ష‌ర్ ప‌టేల్ ఈ మ్యాచ్ లో ఆడతాడా లేదా అన్నది డౌట్ గా ఉంది. ఒక వేళ అక్ష‌ర్ ప‌టేల్ ఆడకపోతే అర్ష‌దీప్ సింగ్ లేదా హ‌ర్ఙిత్  రాణా ఆడే అవ‌కాశ‌ముంది. పేస‌ర్ గా జ‌స్ ప్రీత్ బుమ్రా, స్పిన్న‌ర్లుగా కుల్దీప్ యాద‌వ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బ‌రిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇలా చూసుకుంటే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. అలాగే హ్యాట్రిక్ విజయాలతో ఇండియా ఫుల్ ఫార్మ్ లో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో మరింత జోష్ గా బరిలోకి దిగబోతోందని తెలుస్తోంది. 

ఇక పాక్ విషయానికి వస్తే త‌ర‌చూ ప్లేయింగ్ లెవ‌న్ ను మారుస్తూ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అంతగా రాణించ‌డం లేదు. గ‌త ఆదివారం జ‌రిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫ‌ల్యంతోనే పాకిస్తాన్ ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో ఓడిపోవ‌డంతో అభిమానులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉండ‌టంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాల‌ని టీమ్ మేనేజ్మెంట్ కోరుకొంటోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola