Mirabai Chanu Story: దేశానికే 'మణి'పూసలు.. ఒలింపిక్స్‌లో విజేతలు
అవును వాళ్లు పుట్టుకతోనే ఛాంపియన్స్... మనలా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ లేవు. అయినా ఆట అనేది వాళ్ల లైఫ్‌స్టైల్‌లోనే ఉంది. పుట్టకతో వచ్చిన ఫుడ్ హాబిట్స్, శరీరం.. మణిపూర్ వాసులను ఛాంపియన్లుగా చేస్తున్నాయి.
చుట్టూ కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు... అవే మణిపూర్ వాసులను ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నాయి. ఆటలు మణిపూర్ వాసుల హాబీ. వాళ్ల సంస్తృతిలోనే శ్రమ ఉంది. అందులో నుంచే ఆట పుట్టింది. వాళ్లను ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసింది.
ఒలింపిక్స్ మాత్రమే కాదు.. ప్రపంచంలో వ్యక్తిగత క్రీడలు ఏం జరిగినా భారత్ పాల్గొంటే అందులో మణిపూర్ వాసులు ఉండాల్సిందే. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా సేమ్ సీన్. ఎవరు ముందు బోణీ కొడతారా అని యావత్ దేశం ఎదురు చూస్తున్న టైంలో మీరాభాయి చాను సిల్వర్ సాధించింది. యావత్ దేశాన్నే ఆనంద సాగరంలో ముంచేసింది. క్రీడలు ప్రారంభమైన తొలి రోజే పతకాల పట్టికలో భారత్ పేరు నిలవడంతో దేశ ప్రజలు మురిసిపోతున్నారు. అసలు ఈ మణిపూర్ కథేంటి? వాళ్లు ఇంతగా క్రీడల్లో ఎదగడానికి కారణాలేంటి? మీరే చూసేయండి.