Arshad Nadeem Gold Medal in Paris Olympics 2024 | మేస్త్రీ కొడుకు బంగారు పతకం సాధించాడు.!

Continues below advertisement

Arshad Nadeem Gold Medal in Paris Olympics 2024 |

92.97 మీటర్లతో జావెలీన్ త్రోలో ఒలింపిక్స్ రికార్డు నెలకొల్పిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఐతే.. అతడు ఎంత పూర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఈ స్థాయికి వచ్చాడు అన్నది తెలిస్తే అతడిపై ఇంకాస్త గౌరవం పెరుగుతుంది. అర్షద్ నదీమ్ పాక్ లోని పంజాబ్ జిల్లాలో 1997లో నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి మేస్త్రీ పనికి పోతారు. పంజాబ్ యూత్ ఫెస్టివల్స్ లో మొదటగా డిస్కస్ త్రో, షాట్ పుట్ ప్రయారిటీ ఇచ్చేవాడు. ఆ తరువాత జావెలీన్ త్రో చేసేవాడు. కానీ, అతడి నేచురల్ పవర్ జావెలిన్ త్రో కి సూట్ అవుతుందని కోచ్ అతడి ఇంట్రెస్ట్ ను ఇటువైపుగా మల్చాడు. ఐతే.. పేద కుటుంబం నుంచి వచ్చాడు కదా. ఒకనోక సమయంలో ఇంటర్నేషనల్ మ్యాచులకు వెళ్లడం కోసం ఊరంతా చందాలు వేసుకుని మరి అర్షద్ ను టోర్నమెంట్ లకు పంపారట. 2016 నుంచి ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు ఆడుతున్నాడు. ఐనప్పటికీ.. సరైన స్పాన్సర్లు లేరు. బోర్డు నుంచి సపోర్ట్ లేదు. దేశంలో ఒలింపిక్స్ స్థాయిలో ట్రైనింగ్ ఫెసిలిటీలు లేవు. ఐనప్పటికీ పట్టువదల్లేదు.  ఈ ఏడాది మొదట్లో మోకాలికి ఆపరేషన్ ఐంది. 4 నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. ఐనా లేచి నిలబడ్డాడు. 2015 నుంచి తను ఉపయోగిస్తున్న సెంటిమెంట్ జావెలిన్ ఈ మధ్యనే విరిగిపోయింది. అది కూడా అతడిని కుంగదీసింది. ఐనప్పటికీ.. గోల్డ్ కొట్టాలన్న ఆశ..నీరజ్ చోప్రాను దాటాలన్న కసి..అతడిని వజ్రంలా తయారు చేసింది. అందుకే ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం జావెలీన్ త్రో వేసి.. ఇది గాలి వాటం విజయం కాదు.. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం అని నిరూపించుకున్నాడు గోల్డెన్ బాయ్ అర్షద్ నదీమ్..! 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram