Neeraj Chopra Silver Medal in Paris Olympics 2024| Javelin throwలో వెండి పతకంతో సరిపెట్టుకున్న నీరజ్

Continues below advertisement

Neeraj Chopra Silver Medal in Paris Olympics 2024  | అసలే పారిస్ ఒలింపిక్స్ భారత్ కు అచ్చి రావడం లేదు. ఐనప్పటికీ..జావెలిన్ త్రోలో భారత్ కు కచ్చితంగా గోల్డ్ వస్తుందని అంతా నీరజ్ చోప్రాపై ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే నీరజ్ ఫర్మామెన్స్ ఇచ్చాడు. కానీ, అవుట్ ఆఫ్ సెలబస్ లాగా పాకిస్థాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ సడన్ గా స్క్రీన్ పై కి వచ్చాడు. 89.45 మీటర్లతో నీరజ్ చోప్రా సీజన్ బెస్ట్ ఫర్మామెన్స్ ఇస్తే.. అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్లతో ఒలింపిక్స్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకటి కాదు మొత్తం 6 ఛాన్సుల్లో రెండు సార్లు నదీమ్ 90 మీటర్లు దాటించాడు. ఐతే.. ఇప్పటి వరకు 90 మీటర్లు అందుకుని నీరజ్... అర్షద్ పెట్టిన టార్గెట్ రీచ్ అవ్వడానికైనా 90 మీటర్లు విసురుతాడు అనుకుంటే...అది జరగలేదు. దీంతో.. అర్షద్ గోల్డ్ ఎగరేసుకుపోగా..నీరజ్ చోప్రా వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. గత ఒలింపిక్స్ లో 87.58 మీటర్లతోనే నీరజ్ చోప్రా బంగారం గెలిచాడు. ఇప్పుడు 89 విసిరిన బంగారం దక్కలేదంటే అర్థం చేసుకోవచ్చు అర్షద్ ఏ రేంజ్ లో పోటీ ఇచ్చాడో. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram