Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ

ఐపీఎల్ 19వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 192 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఒకే ఒక్కడు మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతనే ఆఫ్ఘన్ స్పిన్ సెన్సేషన్ నూర్ అహ్మద్. కోల్‌కతా బ్యాటర్లకు తన స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపిస్తూ, 32 పరుగుల తేడాతో CSKకు ఘనవిజయాన్ని అందించాడు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై, సంజూ శాంసన్, డెవాల్డ్ బ్రెవిస్ మెరుపులతో 192 పరుగులు చేసింది. చేజింగ్ లో రహానే, రఘువంశీ నిలకడగా ఆడుతూ KKRను గెలిపించేలా కనిపించారు. కానీ, కెప్టెన్ రుతురాజ్ బాల్ ను నూర్ అహ్మద్‌కు అందించడంతో కథ మొత్తం మారిపోయింది. 11వ ఓవర్లో నూర్ వరుసగా కెప్టెన్ అజింక్య రహానే, కామెరూన్ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేసాడు. 

నూర్ అక్కడితో ఆగలేదు.. ఆ తర్వాతి ఓవర్లోనే ఫినిషర్ రింకూ సింగ్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. కేవలం 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి KKR ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola