డేవిడ్ వార్నర్ లేకుండానే ఈసారి ఐపీఎల్
డేవిడ్ వార్నర్. ఈ పేరు చెబితే తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండరు. పేరుకు ఆస్ట్రేలియనే అయినా మావకు ఆధార్ కార్డు ఒక్కటే తక్కువ. అంతా భారతీయమే. వార్నర్ సోషల్ మీడియా చూసినవాళ్లకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. మన పుష్పను ప్రమోట్ చేస్తూ వార్నర్ గ్రౌండ్ లో వేసే శ్రీవల్లి స్టెప్పులు అయినా...ఎస్ ఎస్ రాజమౌళితో కలిసి చేసే యాడ్ ప్రమోషన్స్ అయినా...ప్రత్యేకించి తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కు డేవిడ్ వార్నర్ వల్లమాలిన అభిమానం. సన్ రైజర్స్ కి ఐపీఎల్ కప్పు సాధించిపెట్టిన కెప్టెన్ గా డేవిడ్ భాయ్ ను ఎప్పుడూ ఆకాశం ఎత్తున చూస్తుంది ఆరెంజ్ ఆర్మీ. అఫ్ కోర్స్ తర్వాత కావ్యాపాపతో వార్నర్ కి ఏవో డిస్ట్రబెన్సెన్స్ రావటం తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లిపోవటం జరిగాయి. బట్ ఐపీఎల్ ని అయితే ఎప్పుడూ మిస్ అవ్వలేదు డేవిడ్ వార్నర్. 2009 నుంచి ఆడుతూనే ఉన్నాడు. మధ్యలో 2018 మాత్రం బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఐసీసీ బ్యాన్ ఉండటంతో ఆడలేకపోయాడు. ఓ రకంగా ఐపీఎల్ ద్వారానే వార్నర్ ఆట తీరుకు ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు. గ్రౌండ్స్ లో ఆటగాళ్లను ఆటపట్టిస్తూ సరదా సరదాగా బోలెడు ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి అందరికీ వార్నర్ తో. అలాంటిది వార్నర్ ను ఈసారి ఐపీఎల్లో ఒక్క టీమ్ కూడా కొనుక్కోలేదు. రీజన్ ఏంటో ఎవ్వరికీ తెలియదు. వార్నర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో అంతగా ఫర్ ఫార్మ్ చేయలేదు. కానీ ఒక్క ఏడాది ఆడకపోతే తీసేసేంత చిన్న ప్లేయర్ అయితే కాదు. 2023 ఐపీఎల్ లో కూడా 500కు పైగా పరుగులు చేశాడు విత్ సెవెన్ హాఫ్ సెంచరీస్. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఫారెన్ ప్లేయర్ కూడా డేవిడ్ వార్నరే. 184 మ్యాచుల్లో 6565 పరుగులతో 4 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలతో ఐపీఎల్ ని ఓ స్టేజ్ కు తీసుకెళ్లి నిలబెట్టిన ప్లేయర్ తను. అలాంటి వార్నర్ ఈసారి ఐపీఎల్ ఆడి ఉంటే పుష్ప 2 కిస్సిక్ స్టెప్పులు వేసేవాడేమో. అలాంటి క్రికెటర్ని, ఎంటర్ టైనర్ ని తీసుకోకపోవటం మాత్రం నిజంగా బాధాకరం.