అర్జున్ టెండూల్కర్‌ని కొనుక్కున్న ముంబయి ఇండియన్స్
అర్జున్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ కి వారసుడిగా క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు. కష్టపడుతున్నాడు ఎవరూ కాదనటం లేదు. కానీ పండితపుత్రులంతా పండితులే కానవసరం లేదు కదా. అదే జరిగింది. ఫాస్ట్ బౌలర్ గా ప్రూవ్ చేసుకుందామనుకుంటున్న అర్జున్ కి రెండేళ్లుగా ఛాన్స్ లు ఇస్తోంది ముంబై ఇండియన్స్. 2023 లో తొలిసారిగా ఆక్షన్ లో 30లక్షలకు కొనుక్కుంది ముంబై ఇండియన్స్. కానీ అర్జున్ ప్రూవ్ చేసుుకన్నది ఏం లేదు. నాలుగు మ్యాచ్ లు బౌలింగ్ చేసి 10 ఓవర్లు విసిరి 92 పరుగులు సమర్పించుకున్నాడు. మూడు వికెట్లు తీశాడు. అది కూడా బౌలర్లవి. ఎకానమీ 9కి పైమాటే. టీ20ల్లో వరస్ట్ ఫర్ ఫార్మెన్స్ ఇది. దీంతో 2024లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఛాన్స్ ఇచ్చింది ముంబై. అతని ఫర్ ఫార్మెన్స్ బాగోలేకపోవటంతో లైట్ తీసుకుంది. 2025 ఐపీఎల్ కోసం నిన్న ఆక్షన్ జరిగింది. అన్ క్యాప్డ్ ప్లేయర్ క్యాటగిరీలో 30లక్షల బేస్ ప్రైస్ తో అర్జున్ టెండూల్కర్ ఆక్షన్ కి వచ్చాడు. కానీ ఎవ్వరూ కొనలేదు. ముంబై ఇండియన్స్ కూడా తమకేం పట్టన్నట్లు గా వ్యవహరించింది. కానీ గంట తర్వాత మిగిలిపోయిన వాళ్లను మళ్లీ ఆక్షన్ వేస్తారు కదా...అప్పుడు మాత్రం ముంబై ఇండియన్స్ 30 లక్షల బేస్ ప్రైస్ కే అర్జున్ టెండూల్కర్ ను తీసుకుంది. పైగా అప్పుడు నీతా అంబానీ, ఆకాశ్ అంబానీల ఎక్స్ ప్రెషన్ చూడండి. ఇదీ పరిస్థితి. ఎవరి కోసం అర్జున్ కి మళ్లీ ఛాన్స్ ఇచ్చింది ఐదుసార్లు ఛాంపియన్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్. అసలు గంటలోనే అంబానీలు మనసు మార్చుకోవటానికి రీజన్ ఏంటీ..ఈలోపు ఏమన్నా ఫోన్లు వచ్చాయా... ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ దేవుడు కాబట్టి మనం మాట్లాడలేం కానీ ఫ్యాన్స్ ఊరుకోరు కదా కామెంట్స్ లో ఇదిగో ముంబైని ఇంత గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు.