MS Dhoni Comments on Twitter | Dubai Eye 108.3 ఈవెంట్ లో ధోనీ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
ఎలన్ మస్క్ కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని షాకిచ్చాడు. ఇదెప్పుడు జరిగింది అని కంగారుపడకండి చెప్తాను. ధోని ఐపీఎల్ ముగిసిన తర్వాత దుబాయ్ ఐ 108.3 ఈ వెంట్ లో పాల్గొన్నాడు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తో కలిసి పార్టిసిపేట్ చేసిన ధోనీ పలు విషయాలపై తన అభిప్రాయాలు చెప్పాడు. అందులో ప్రధానంగా సోషల్ మీడియాలో యాక్టివ్ పార్టిసిపేషన్ ఎందుకు ఉండదో చెప్పాడు ధోనీ. తను చెప్పాలనుకున్న విషయాన్ని ఇన్ స్టాలో చెప్పటానికి ఇష్టపడతానని...ట్విట్టర్ లో తనకు అంత కంఫర్ట్ గా ఉండదని చెప్పాడు. కేవలం 140 పదాలు కూడా మించకూడదని ట్విట్టర్ లో ఉండే రూల్స్ అవన్నీ మనం ఒకటి చెప్తే జనాలకు మరొకటి అర్థం అవుతాయని..మళ్లీ దానికి కింద పెద్ద పెద్ద చర్చలు నడుపుతూ ఉండటం తనకు పెద్ద చిరాకు వ్యవహారం అన్నాడు ధోని. దాని బదులు ఇన్ స్టాలో ఓ ఫోటోనో వీడియోనో పెట్టేసి సైలెంట్ గా ఉండటం ఉత్తమమని అన్నాడు. ఇప్పుడు ఇన్ స్టా లో కూడా మార్పులు వచ్చేస్తున్నాయని అయినా తను మాత్రం ట్విట్టర్ కి బదులుగా ఇన్ స్టానే ప్రిఫర్ చేస్తానని చెప్పాడు. ధోనీ ఏదైనా ప్రొడెక్ట్ ని ప్రమోట్ చేయటంలో చాలా గుడ్ విల్ ఉన్న బ్రాండ్ అంబాసిడర్. తను రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఐపీఎల్ టైమ్ లో చూడండి ధోని ప్రమోట్ చేస్తున్న యాడ్సే ఎక్కువ కనిపిస్తుంటాయి. అలాంటి వ్యక్తి ఓ సోషల్ మీడియాను తక్కువ చేసి మాట్లాడటం అంటే దాని కంపెనీకి, అధినేతకి షాక్ ఇచ్చినట్లే అంటున్నారు ఫ్యాన్స్.