KKR vs SRH Qualifier 1 Match Highlights | 8వికెట్ల తేడాతో SRH పై KKR ఘన విజయం | IPL 2024 | ABP Desam

అదరగొట్టే ఫర్ ఫార్మెన్స్ తో అరివీర భయంకర బ్యాటర్లతో ప్రత్యర్థులను వణికిస్తూ క్వాలిఫైయర్స్ కి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్స్ లో 1 కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఊహించని పరాభవాన్ని ఎదుర్కొంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో చూద్దాం.  సన్ రైజర్స్ విసిరిన 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా కు ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చినా దాన్ని భారీ  స్కోర్లుగా మలచలేకపోయారు. కానీ ఆ లోటును భర్తీ చేశారు కేకేఆర్ ను విజయం దిశగా నడిపించారు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వన్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్. సన్ రైజర్స్ బౌలర్లను భయం లేకుండా ఎదుర్కొంటూ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో మోత మోగించారు. వెంకటేశ్ అయ్యర్ 51పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 58పరుగులతో KKR కు 8వికెట్ల విజయాన్ని అందించారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ ను KKR బౌలర్ మిచెల్ స్టార్క్ వణికించాడు.తోప్ బ్యాటర్ హెడ్ ను డకౌట్ చేయటంతో పాటు నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ ల వికెట్లు తనెంత డేంజరస్ బౌలరో ప్రూవ్ చేశాడు. 4ఓవర్లలో 34పరుగులు ఇచ్చి 3కీలక వికెట్లు తీయటం ద్వారా సన్ రైజర్స్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు స్టార్క్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola