Mohammed Shami 8 Wickets in Ranji Trophy | రంజీ సెమీస్‌లో షమీ విధ్వంసం

Continues below advertisement

టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కన పట్టేసిన, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించినా.. బెంగాల్ టైగర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami ) తన పట్టు వీడటం లేదు. గాయాలు వెంటాడుతున్నా, వయసు పెరుగుతున్నా కూడా తనలో ఆడే సత్తా ఉందని సెలెక్టర్లకు సమాధానం చెబుతున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీ 2025-26 ( Ranji Trophy 2025-26 ) సెమీఫైనల్‌లో జమ్మూ కశ్మీర్‌పై షమీ కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 

కోల్‌కతాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో షమీ ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. చేతికి గాయమైనా, కట్టు కట్టుకుని బరిలోకి దిగి 22.1 ఓవర్లలో కేవలం 90 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. షమీ 13 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. 

ఈ సీజన్‌లో షమీ మూడు ఫార్మాట్లలో కలిపి 21 మ్యాచ్‌ల్లో ఏకంగా 67 వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్నాడు. 7 రంజీ మ్యాచ్‌ల్లోనే 36 వికెట్లు తీయడం విశేషం. దేశవాళీలో షమీ చేస్తున్న ఈ విధ్వంసం చూశాక, నెటిజన్లు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షమీని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలనే అంశంపై మరోసారి ఆలోచించాలని అంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola