India vs Netherlands T20 World Cup 2026 | ఇండియా తుది జట్టులో కీలక మార్పులు?

Continues below advertisement

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ( ICC T20 World Cup 2026 ) హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా, నేడు అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో ( India vs Netherlands ) తలపడనుంది. ఇప్పటికే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న భారత్, లీగ్ దశను అజేయంగా ముగించాలని పట్టుదలతో ఉంది. పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించిన తర్వాత, నెదర్లాండ్స్‌పై కూడా అదే కసితో గెలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ మ్యాచ్ కోసం భారత ప్లేయింగ్ 11 లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కుల్దీప్ యాదవ్‌పై ( Kuldeep Yadav ) వేటు పడే అవకాశం ఉంది. అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ దృష్ట్యా కుల్దీప్ స్థానంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ( Arshdeep Singh ) రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. ఇక జస్‌ప్రీత్ బుమ్రాకు ( Jasprit Bumrah ) రెస్ట్ ఇవ్వాలనుకుంటే మహమ్మద్ సిరాజ్‌కు ( Mohammed Siraj ) అవకాశం దక్కవచ్చు. 

ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఫామ్ ఇప్పుడు కలవరపెడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన అతను, సూపర్-8కి ముందు ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అభిషేక్ రాణించకపోతే సంజూ శాంసన్ ( Sanju Samson ) వైపు టీమ్ మేనేజ్మెంట్ చూసే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) సూపర్ ఫామ్‌లో ఉండగా, తిలక్ వర్మ, సూర్య, హార్దిక్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola