Mohammad Yousuf about Suryakumar | సూర్యకుమార్‌పై మాజీ క్రికెటర్ దారుణ వ్యాఖ్యలు

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా పాకిస్తాన్ ప్లేయర్స్ తో చేతులు కలపకపోవడం రోజు రోజుకి వివాదంగా మారుతుంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ ఒక టీవీ షోలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను 'పంది' అని సంబోధించాడు. భారత్ అంపైర్లు, మ్యాచ్ రెఫరీలను ఉపయోగించి పాకిస్తాన్‌ను వేధిస్తున్నారని అన్నారు యూసఫ్. యూసఫ్ మాట్లాడుతూ.. “భారత్ తమ సినీ ప్రపంచం నుండి బయటకు రాలేకపోతోంది. వాళ్లు గెలవడానికి ప్రయత్నిస్తున్న తీరు, అంపైర్లను ఉపయోగించుకుంటున్న తీరు, మ్యాచ్ రెఫరీ ద్వారా పాకిస్థాన్‌ను వేధిస్తున్న తీరు సిగ్గుచేటు. ఇది చాలా పెద్ద విషయం” అని అన్నారు మహ్మద్ యూసఫ్. 

భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్... టీమ్ ఇండియా ప్లేయర్స్ కు తమ టీమ్ తో చేతులు కలపొద్దని చెప్పారని పాక్ ఆరోపించింది. దీనిపై పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేస్తూ.. పైక్రాఫ్ట్‌ను పాకిస్థాన్ మ్యాచ్ నుంచి తొలగించాలని కోరింది. కానీ ఐసీసీ ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. పైక్రాఫ్ట్ ఆలా చేయలేదని చెప్పుకొచ్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola