Team India Jersey Sponsor | టీమ్ ఇండియా స్పాన్సర్ గా అపోలో టైర్స్
ఇండియన్ క్రికెట్ టీమ్ కు కొత్త స్పాన్సర్ దొరికేసింది. ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. అపోలో టైర్స్ టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా రికార్డు స్థాయిలో బిడ్ వేసింది. అపోలో టైర్స్ రెండున్నర సంవత్సరాల పాటు టీమ్ ఇండియా జెర్సీకి స్పాన్సర్‌గా ఉండనుంది. వచ్చే మూడేళ్లలో టీమ్ ఇండియా 121 ద్వైపాక్షిక మ్యాచ్‌లు, 21 మల్టీ-నేషన్ టోర్నమెంట్‌లలో ఆడనుంది. ఈ మొత్తం టైమ్ లో బీసీసీఐకి 579 కోట్ల రూపాయలను చెల్లిస్తుంది అపోలో టైర్స్.
అపోలో టైర్స్, బీసీసీఐ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి దాదాపు 4.77 కోట్ల రూపాయలను చెల్లిస్తుంది. ద్వైపాక్షిక మ్యాచ్‌లు, ఐసీసీ టోర్నమెంట్ .... ఇలా ప్రతి మ్యాచ్ కు వేర్వేరుగా ఉండవచ్చు. బీసీసీఐ ద్వైపాక్షిక మ్యాచ్‌ల కోసం 3.5 కోట్ల రూపాయలు, ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం 1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ ను నిర్ణయించింది. మూడేళ్లలో టీమ్ ఇండియా 121 ద్వైపాక్షిక మ్యాచ్‌లు, 21 మల్టీ-నేషన్ టోర్నమెంట్‌లలో ఆడనుంది.