MI Batting Line Up vs CSK IPL 2026 | ముంబై బ్యాటర్ల ఘోర వైఫల్యం

ఐపీఎల్ 2026 సీజన్‌లో CSKపై ముంబై చేసిన పెరఫార్మన్స్ కి ఫ్యాన్స్ అంత డిస్సపాయింట్ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫిక్స్ చేసిన 208 రన్స్ టార్గెట్ ను ముంబై చేరుకోలేక పోయింది. ముంబై బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. కేవలం 104 పరుగులకే పరిమితమైన ముంబై, 103 పరుగుల భారీ తేడాతో తన ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది.

టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు ఏ ఒక్క బ్యాట్సమన్ కూడా ఆడలేక పొయ్యారు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే ముంబై కథ ముగిసిపోయింది. ఓపెనర్ డానిష్ మలేవర్, నమన్ ధీర్ ఇద్దరూ డకౌట్ అయి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్ కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరడంతో ముంబై 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కొద్దిసేపు పోరాడి 73 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పినప్పటికీ అది ఏమాత్రం సరిపోలేదు. వీరిద్దరూ కూడా అకీల్ హోసెన్ స్పిన్ కు చిక్కారు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఫినిషర్ రూథర్‌ఫోర్డ్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు బ్యాటర్లు 0 కె వెనుదిరగడం వారి బ్యాటింగ్ ఫెయిల్యూర్ కు నిదర్శనం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola