Sanju Samson Century vs MI IPL 2026 | ఒక సెంచరీతో రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ

ఐపీఎల్ 2026లో వాంఖడే స్టేడియంలో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 బాల్స్ లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసిన సంజూ, ఒకే ఇన్నింగ్స్‌తో ఏకంగా 5 అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై సెంచరీ బాదిన తొలి సీఎస్‌కే బ్యాటర్‌గా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. గత 19 ఏళ్లలో ముంబైపై శతకం నమోదు చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆ రికార్డును సంజూ క్రియేట్ చేసాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల లిస్ట్ లో సంజూ రోహిత్ శర్మ సరసన నిలిచాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉండగా, సంజూ మరో శతకం బాదితే వారి రికార్డులను బద్దలు కొట్టనున్నాడు.

ఒకే ఐపీఎల్ సీజన్‌లో చెన్నై తరపున రెండు సెంచరీలు బాదిన రెండో బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. గతంలో 2018లో షేన్ వాట్సన్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ లో సంజూకు ఇది 5వ సెంచరీ. దీనితో అత్యధిక ఐపీఎల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్‌ను సంజూ సమం చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola