Lucknow Super Giants: టీం లోగోను విడుదల చేసిన లఖ్ నవూ ఫ్రాంచైజీ
ఈ ఏడాది ఐపీఎల్ నుంచి మరో 2 జట్లు టోర్నీలోకి అడుగుపెట్టాయి. అవే లక్నో సూపర్ జెయింట్స్, అహ్మదాబాద్ ఫ్రాంచైజీ. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ఫ్రాంచైజీ నేం ప్రకటించి, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. ఇప్పుడు తమ జట్టు లోగోను విడుదల చేసింది. ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసింది. ఈ లోగో పెట్టడం వెనుక తమ ఐడియాను ఓ ప్రెస్ నోట్ ద్వారా వివరించింది. భారత పురాణాల నుంచి ఈ లోగో స్ఫూర్తి పొందిందని తెలిపింది. శ్రీ మహావిష్ణువు వాహనం గరుడ పక్షి ఆధారంగా తమ టీమ్ లోగోలో వింగ్స్ ని యాడ్ చేశామంది. ఆ వింగ్స్ కలర్ ని... భారత పతాక త్రివర్ణాలతో రూపొందించామని.. తమ జట్టు పాన్ ఇండియా లెవెల్ లో రీచ్ అవడానికి ఇలా చేశామని వివరించింది. గరుడ పక్షి బాడీ ఉండే ప్లేస్ లో నీలి రంగులో క్రికెట్ బ్యాట్ ను పెట్టామని, దాని ద్వారా ఈ ఆట గురించి వివరించామని తెలిపింది. దీనిపై రెడ్ కలర్ బంతిని ఉంచామని.... అది విజయ తిలకంలా భావిస్తున్నామని పేర్కొంది. ఈ లోగో వల్ల టీంకు పాజిటివ్ ఎనర్జీ వచ్చి, టీం సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నట్టు వివరించింది. ఈ జట్టు ప్రతి ఒక్క భారతీయుడికీ చెందినదని తన ట్వీట్ లో పేర్కొంది.