KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గ్రౌండ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ, రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగాల్సి వచ్చింది.
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు రాహుల్ తన సూపర్ ఎక్సపీరియెన్స్ తో మంచి స్టార్ట్ ఇచ్చారు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 32 పరుగులకు రనౌట్ అయ్యాక, క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తో కలిసి రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు దాడి చేస్తూనే, మరోవైపు పడిక్కల్ కు దిశానిర్దేశం చేస్తూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే రాహుల్ 127 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్లాసిక్ షాట్లతో సెంచరీ దిశగా వెళ్ళాడు.
అయితే, టీ బ్రేక్ తర్వాత ఆఖరి సెషన్ ప్రారంభమయ్యే సమయంలో రాహుల్ కు చేతి మరియు కాలి కండరాలు తీవ్రంగా పట్టేశాయి. ఫిజియోల సాయంతో మైదానంలోకి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, నొప్పి తీవ్రమవ్వడంతో అతడు బ్యాటింగ్ కొనసాగించలేకపోయాడు. దాంతో 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.