Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ

Continues below advertisement

గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ మొదటి రోజే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట 73 ఓవర్లకే పరిమితమైనప్పటికీ, టీమిండియా 2 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ మ్యాచ్‌ లో యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో మెరిసాడు. నంబర్ 3 స్థానంలో వచ్చిన పడిక్కల్ 178 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ తో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నంబర్ 3 స్థానంలో భారత్ తరఫున దాదాపు 20 టెస్టుల తర్వాత ఒక బ్యాటర్ సెంచరీ కొట్టాడు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ప్రారంభాన్ని అందించారు. తొలి వికెట్‌ కు 47 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్‌ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ ను ముందుకు నడిపాడు. వీరిద్దరూ రెండో వికెట్‌ కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, రాహుల్ 77 పరుగుల వద్ద కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్‌ గా వెనుదిరిగాడు. తొలి రోజే గాలే పిచ్ పై బంతి బాగా టర్న్ అవుతుండటంతో శ్రీలంకకు ముప్పు పొంచి ఉంది. భారత్ వేగంగా పరుగులు సాధించడంతో భారీ స్కోరు చేసే అవకాశం దక్కింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola