KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్

Continues below advertisement

కోల్కతా ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ టీమ్ ను ఆఖరి రెండు ఓవర్లు మినహాయిస్తే కేకేఆర్ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. కేకేఆర్ బౌలింగ్ దాటికి ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్, నమన్ ధీర్ లను అవుట్ చేసి కామెరాన్ గ్రీన్ కోల్‌కతాకు అదిరిపోయే బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ రెండు భారీ సిక్సర్లు బాదినా సౌరభ్ దూబే బౌలింగ్‌లో అవుట్ కాగా.. పవర్‌ప్లే ముగిసేలోపే సూర్యకుమార్ యాదవ్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

మధ్యలో వర్షం పడి మ్యాచ్ ఆగి, మళ్లీ ప్రారంభమైనా ముంబై రాత మారలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసినా.. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ 4 ఓవర్లలో కేవలం 13 రన్స్ ఇచ్చి పాండ్యా వికెట్ తీసి ముంబైని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 18వ ఓవర్ వరకు పూర్తిగా కేకేఆర్ గుప్పిట్లోనే మ్యాచ్ నడిచింది. మొదటి ఇన్నింగ్స్ లో KKR డామినేషన్ తో పాటు అల్ రౌండ్ షో చేయడంతో కోల్కతా విజయాన్ని అందుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola