Jason Holder Record: బౌలింగ్ లో రికార్డు ఫిగర్స్ నమోదు చేసిన జేసన్ హోల్డర్
WestIndies ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ అరుదైన రికార్డు సాధించాడు. T20I ల్లో వరుసగా నాలుగు బాల్స్ లో నాలుగు వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా నిలిచాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ ఆఖరి మ్యాచ్ లో.... ఆఖరి ఓవర్ లో 20 పరుగులు డిఫెండ్ చేసేందుకు వచ్చిన హోల్డర్... 2,3,4,5 బంతులకు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను ఆలౌట్ చేశాడు. తద్వారా విండీసి ఈ సిరీస్ 3-2 తో గెలిచేందుకు తోడ్పడ్డాడు. ఈ సిరీస్ లో మొత్తం మీద 15 వికెట్లు తీసిన జేసన్ హోల్డర్... మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. ఇంతకముందు వరుస 4 బాల్స్ లో 4 వికెట్లు తీసినవారిలో Rashid Khan, Lasith Malinga, Curtis Campher ఉన్నారు.