Yash Dayal Bowling vs CSK IPL 2025 | నాడు రింకూ చేతిలో పరాభవం..తర్వాత ఊహించని రీతిలో పరాక్రమం | ABP Desam
ఏదైనా బౌలర్ ఓ సారి చెత్త రికార్డును నమోదు చేశాడంటే చాలు క్రికెట్ లో తనను ఎప్పుడూ చెత్త బౌలర్ అన్నట్లే చూస్తారు. అట్లీస్ట్ ఆ మరకను తుడుచుకోవాలన్న చాలా అంటే చాల కష్టపడాలి. బట్ ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ అలాంటి ఓ టఫెస్ట్ ఫేస్ ను సక్సెస్ ఫుల్ గా అధిగమించి రెండేళ్లలో రెండుసార్లు ఆర్సీబీకి చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుతమైన విజయాలు అందించాడు. 2023 అందరికీ గుర్తుండే ఉంటుందా. కోల్ కతా నైట్ రైడర్స్ లో రింకూ సింగ్ అనే బ్యాటర్ సృష్టించిన విధ్వంసం. గుజరాత్ మీద మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో 30 పరుగులు చేస్తే కానీ గెలవటం అంటే 5 సిక్సులు బాది రింకూ ఆ మ్యాచ్ ను గెలిపిస్తాడు. ఆ మ్యాచ్ లో రింకూ కు బౌలింగ్ చేసింది యశ్ దయాలే. కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు యశ్ దయాల్. ఐపీఎల్ లాంటి కమర్షియల్ ప్లాట్ ఫామ్ లో ఓవర్ లో 30పరుగులు ఇచ్చుకుని మ్యాచ్ ను ఓడిపోయేలా చేశాడంటే ఇంకెవ్వరూ తనను తీసుకోను కూడా తీసుకోరు అనుకుని ఉంటాడు. కానీ ఆర్సీబీ యశ్ దయాల్ కి రెండో ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛాన్స్ ని యశ్ దయాల్ రెండు సార్లు ప్రూవ్ చేసుకుని తనో ఛాంపియన్ బౌలర్ ని అని రెండు సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. మిగిలిన మ్యాచ్ లు ఎలా ఉన్నా ఆర్సీబీ చెన్నై పై మ్యాచ్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. కెప్టెన్లు ఎవరనే సంగతి పక్కన పెడితే అందరికీ అది ధోనీ వర్సెస్ కొహ్లీ మ్యాచ్. అలాంటి గతేడాది 2024లో ఆఖరి ఓవర్ లో ధోనీ జడేజాలు స్ట్రైక్ లో ఉండగా ధోనిని అవుట్ చేసి ఆర్సీబీని మ్యాచ్ లో గెలిపించిన యశ్ దయాల్ మళ్లీ ఏడాది తర్వాత నిన్న కూడా ధోనీ, జడేజా క్రీజులో ఉండగా ఓవర్ లో జస్ట్ 15పరుగులే కొడితే చాలన్నా కూడా ధోనిని మళ్లీ అవుట్ చేసి ఆర్సీబీని 2 పరుగుల తేడాతో చెన్నైపై గెలిపించాడు యశ్ దయాల్. లైఫ్ రెండో ఛాన్స్ ఇస్తే కొంత మంది బౌలర్లు ఎంత అద్భుతంగా రాణిస్తారనే దానికి ఉదాహరణగా తన గతాన్ని చెరిపేస్తూ ఆర్సీబీకి ఛాంపియన్ బౌలర్ గా ఎదుగుతున్నాడు యశ్ దయాల్.