Ayush Mhatre 94 runs vs RCB | IPL 2025 లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన 17ఏళ్ల కుర్రాడు ఆయుష్ మాత్రే | ABP Desam
IPL 2025. క్రికెట్ లో టీమిండియా ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన సంవత్సరం. ఎందుకంటే ఈ సీజన్ లో ఆణిముత్యాల్లాంటి యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. వైభవ్ సూర్య వంశీ, ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, విప్రాజ్ నిగమ్, అనికేత్ వర్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ కి ఎండే లేదు. పదుల సంఖ్యలో కుర్ర ఆటగాళ్లు మెరిసిన ఈ లీగ్ లో...నిన్న ఆయుష్ మాత్రే ఆట గురించి ఎంత పొడిగినా తప్పు లేదు. చెన్నై మ్యాచ్ లో గెలవాలంటే 214పరుగులు చేయాలి.
సీజన్ అంతా పరాజయాలతో అసలు 180పైగా పరుగులు ఛేజ్ చేసిందే ఇటీవలి కాలంలో చెన్నైకి లేదు. అయినా చెన్నై ఓపెనర్ 17ఏళ్ల టీనేజర్ ఆయుష్ మాత్రమే అదురు బెదురు లేకుండా ఆడాడు. ముందు షేక్ రషీద్ తో కలిసి 50పరుగుల పార్టనర్ షిఫ్ ను నెలకొల్పిన మాత్రే... తర్వాత జడేజా తో కలిసి బౌండరీల మోత మోగించాడు మాత్రే. ప్రత్యేకించి ఆర్సీబీ వేసిన 4ఓవర్ గురించి చెప్పుకోవాలి. ఎంత పవర్ ప్లే అయినా బౌలింగ్ వేసింది స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అక్కడ. అలాంటి ఛాంపియన్ బౌలర్ ని ఓవర్ అంతా బౌండరీలు కొట్టాడు మాత్రే. మొదటి మూడు బంతులకు మూడు ఫోర్లు నాలుగో బంతికి భారీ సిక్సర్ మళ్లీ ఐదు ఆరు బంతులకు రెండు ఫోర్లు..అలా ఊచకోత కోసిన ఆయుష్ మాత్రే..ఆ ఒక్క ఓవర్ లో 26పరుగులు రాబట్టాడు. అసలు బౌలింగ్ వేస్తోంది ఎవరని చూడకుండా అణువిస్ఫోటనం లా మారి 48 బాల్స్ లో 9 ఫోర్లు 5 సిక్సర్లతో 94 పరుగులు చేసి అవుటయ్యాడు. సిక్సర్ తో సెంచరీ చేద్దామని భావించి ముందు కొచ్చి షాట్ ఆడి క్యాచ్ ఇచ్చేసి అవుటై పాపం ఫస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నాడు కానీ అద్భుతంగా ఆడాడు ఆయుష్ మాత్రే. అసలు మాత్రే ఉండుంటే చెన్నై మ్యాచ్ ను ఓడిపోయి ఉండేదే కాదు. ఆస్థాయిలో ప్రభంజనం సృష్టించాడు అది కూడా 17ఏళ్ల చిన్న వయస్సులో. ఆ మైండ్ సెట్ గురించి చెప్పుకోవాలి. టీమిండియా ఫ్యూచర్ అయితే సేఫ్ అనిపిస్తుంటే ఇంతటి ఫియర్ లెస్ ఇన్నింగ్స్ కుర్రాళ్ల నుంచి చూస్తుంటే.