Travis Head Failures | SRH కి బలమూ అతడే..బండకేసి బాదింది అతడే | IPL 2024 | ABP Desam
ఈ సీజన్ లో సన్ రైజర్స్ బ్యాటింగ్ కి వెన్నెముకలా మారి అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్ గా శివాలెత్తాడు ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావియెస్ హెడ్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఫామ్ ను కొనసాగిస్తూ సన్ రైజర్స్ కి పరుగుల వరద పారించాడు. లక్నో 160పరుగుల టార్గెట్ పెడితే ఈ ఇద్దరూ కలిసి 9ఓవర్లలోనే కొట్టేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్ లో విధ్వంసం సాగించారో. అలాంటి ఆ ఇద్దరూ సన్ రైజర్స్ కి అవసరమైన కీలక దశలో చేతులెత్తేశారు. సరే అభిషేక్ శర్మ అంటే ఇంకా యంగ్ స్టర్ అనుకోవచ్చు కానీ SRH బ్యాటింగ్ కి తెడ్డులా మారిన హెడ్డు చేతులు ఎత్తేసిన విధానమే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ గుండెలు పిండేసింది. సీజన్ లో 191 స్ట్రైక్ రేట్ తో 32సిక్సర్లు బాది ఓ సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలతో 567పరుగులు చేసిన హెడ్ ఆడిన లాస్ట్ నాలుగు మ్యాచుల స్కోరెంతో చూడండి. లాస్ట్ లీగ్ మ్యాచ్ లో పంజాబ్ మీద డకౌట్. క్వాలిఫైయర్ 1 లో కోల్ కతా మీద డకౌట్. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ మీద 28బాల్స్ ఆడి 34పరుగులు...అసలు సిసలు ఫైనల్ మ్యాచ్ లో మళ్లీ కోల్ కతా మీద డకౌట్. ఆఖరి నాలుగు మ్యాచుల్లో మూడుసార్లు డకౌట్ అయ్యి 34పరుగులే చేశాడు. అటు వైపు అభిషేక్ శర్మ కూడా అంతే ఈ సీజన్ లో 204 స్టైక్ రేట్ తో 484పరుగులు చేసినా క్వాలిఫైయర్ 1లో 3పరుగులు, క్వాలిఫైయర్ 2లో 12పరుగులు, కీలకమైన ఫైనల్ లో రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. సన్ రైజర్స్ కి ఎంతో కీలకమైన ఈ ఓపెనర్లు ఇద్దరూ ఇలా అవసరమైన ఆఖరి మూడు మ్యాచుల్లోనూ పవర్ ప్లేలోనే అది కూడా మొదటి రెండు మూడు ఓవర్లలోనే అవుటైపోవటమే సన్ రైజర్స్ కు కప్ ను దూరం చేసింది.