Sun Risers Hyderabad IPL 2025 Records | సీజన్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసి..అంతే గ్రాండ్ గా ముగించిన SRH

 ఈ ఐపీఎల్ సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ రేంజ్ లో గ్రాండ్ గా మొదలు పెట్టిందో అదే రేంజ్ లో గ్రాండ్ గా ముగించింది. అనేక అంచనాలు..300పరుగుల రికార్డులను బద్ధలు కొట్టేస్తారనే నమ్మకాల మధ్య ఈ ఐపీఎల్ సీజన్ ను ప్రారంభించిన ఆరెంజ్ ప్రారంభం అద్భుతమైనా ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఫలితంగా సీజన్ లో ఇంకా 10 మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఎలిమినేట్ అయిపోయినా ఫినిషింగ్ తనదైన స్టైల్ లో ఇచ్చి తను ఎందుకు ప్రమాదకరమైన జట్టో చాటి చెప్పింది సన్ రైజర్స్. ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మీద ఆడింది సన్ రైజర్స్. హైదరాబాద్ లో జరిగిన ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 286 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు అది. మొదటిది కూడా సన్ రైజర్స్ పేరు మీద ఉంది. ఆ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ తో అదరగొట్టడంతో ఈ సారి మిగిలిన టీమ్స్ కి చుక్కలు కనిపించటం ఖాయం అని భావించారు హైదరాబాద్ ఫ్యాన్స్. RR ఆ మ్యాచ్ లో బాగానే ప్రతిఘటించినా 242పరుగులకు మించి చేయలేకపోవటంతో 44 పరుగుల తేడాతో గెలిచింది సన్ రైజర్స్. తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయిన సన్ రైజర్స్...తిరిగి తమ ఆరో మ్యాచ్ లో పంజాబ్ పై భారీ టార్గెట్ ను ఛేజ్ చేసింది. హైదరాబాద్ లోనే జరిగిన ఆ మ్యాచ్ లో పంజాబ్ ముందు బ్యాటింగ్ చేసి 245పరుగుల చేస్తే...ఛేజింగ్ లో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించటంతో 247పరుగులు ఛేజింగ్ లో బాదేసి 8వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది SRH. తర్వాత మళ్లీ ఓటములు పలకరించినా లక్నో ఎకానా స్టేడియంలో LSG పై తొలిసారి 200పరుగులకు పైగా ఉన్న టార్గెట్ ను ఛేజ్ చేసి రికార్డు నెలకొల్పింది హైదరాబాద్. సీజన్ ముగించే ముందు వరుసగా LSG, RCB, నిన్న KKR లపై విజయాలతో వరుసగా మూడు విక్టరీలు అందుకుంది సన్ రైజర్స్. నిన్న కేకేఆర్ పై కాటేరమ్మ కొడుకు క్లాసెన్ విరుచుకుపడటంతో మరోసారి భారీ స్కోరు పండగ చేసింది. క్లాసెస్ ఫాస్టెస్ట్ సెంచరీతో ఏకంగా 278 పరుగులు చేసిన హైదరాబాద్ KKR ను 168 పరుగులకే ఆలౌట్ చేసి 110పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని కొట్టింది. మొత్తంగా ఆడిన 14 మ్యాచుల్లో 6 విజయాలు, 7 పరాజయాలు, ఓ ఫలితం తేలని మ్యాచ్ తో 13 పాయింట్లు సాధించిన SRH ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్ లో 6 వ స్థానం సాధించి సీజన్ ను ముగించింది. కానీ ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ మాత్రం ఆరెంజ్ ఆర్మీ అంటే పక్కా ఇంకో రేంజ్ బ్రో అన్నట్లే ఆడింది సన్ రైజర్స్ హైదరాబాద్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola