Srh vs RR Qualifier 2 | Travis Head and Abhishek Sharma వీళ్లీద్దరే మన SRH బలం, బలహీనత
ఈ రోజే SRH vs RR మధ్య క్వాలిఫైయర్ 2. ఈ మ్యాచ్ లో గెలిచిన వారే ఆదివారం KKRతో ఫైనల్ లో తలపడతారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో SRH బలం, బలహీనత రెండు వీళ్లిద్దరే. ట్రావెస్ హెడ్ , అభిషేక్ శర్మలు.
ఈ రోజే SRH vs RR మధ్య క్వాలిఫైయర్ 2. ఈ మ్యాచ్ లో గెలిచిన వారే ఆదివారం KKRతో ఫైనల్ లో తలపడతారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో SRH బలం, బలహీనత రెండు వీళ్లిద్దరే. ట్రావెస్ హెడ్ , అభిషేక్ శర్మలు. వీళ్లు ఎంత సేపు క్రీజులో ఉంటే అంత మంచిది లేకుంటే SRH పని గోవిందే. ఎందుకంటే..ఈ సీజన్ లో వీళ్లిద్దరి మధ్య ఎక్కువగా పార్టనర్ షిప్ నమోదైంది. వీళ్లిద్దరు 676 పరుగుల పార్ట్ నర్ షిప్ నమోదు చేశారు.వీళ్లిద్దరు కలిసి ఈ టోర్నీలో మూడు సార్లు వందకుపైగా పార్ట్ నర్ షిప్స్ నమోదు చేశారు. మరి ముఖ్యంగా పవర్ ప్లేలో చిరుత పులుల్లా చెలరేగిపోతారు. వీళ్ల దూకుడుతో పవర్ ప్లేలో 6 సార్లకుపైగా SRH 70కిపైగా పరుగులు సాధించింది. దిల్లీ క్యాపిటల్స్ పై 6 ఓవర్లలో 125 పరుగులతో రికార్డు సృష్టించారు. LSGతో మ్యాచ్ లో ఐతే 10 ఓవర్లలోనే 166 పరుగుల టార్గెట్ ను ఫినిష్ చేశారు. వీళ్లిద్దరు క్రీజులో ఉంటే స్ట్రైక్ రేట్ 229గా ఉంటుంది. అంటే ఒక్క బాల్ కు 2 పరుగుల కంటే ఎక్కువే అనమాట. సో.. ఇలా..పవర్ ప్లేలో మనోళ్లు ఓ 70-80 కొట్టారనుకోండి ఆ మూమెంటమ్ అలాగే కొనసాగించి ఈజీగా 200కుపైగా పరుగులు సాధించాలి ఇదే SRHప్లాన్. ఇన్నాళ్లు ఇదే వర్కౌట్ ఐంది. ఏ మ్యాచులో ఐతే వీరిద్దరు త్వరగా ఔట్ అవుతారో ఇప్పుడే స్కోర్ తగ్గుతుంది. లేకుంటే 200 మినిమమ్ కొడుతోంది SRH. సో.. నేడు చెన్నై చెపాక్ స్టేడియంలో మ్యాచ్ కాబట్టి.. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అదే జరిగితే.. అభిషేక్ శర్మ, ట్రావెస్ హెడ్ లో ఒక 7-8 ఓవర్లు వికెట్ పడకుండా ఆడితే.. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసే సరికే SRH విజయం ఖాయమైపోయే అవకాశముంటుంది. కాబట్టి..వీళ్లిద్దరు ఈ రోజు చేలరేగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.