India vs Pakistan T20 World Cup Ticket Price | భారత్, పాక్ మధ్య పోరు.. లక్షల్లో టికెట్ ధరలు

Continues below advertisement

ఇండియా వెర్సస్ పాకిస్థాన్... ఈ టైటిల్ చాలు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ ఊగిపోవడానికి. ఈ మ్యాచ్ ఇండియాలో జరిగినా.. ఆస్ట్రేలియాలో జరిగినా... ఆఖరికి వెస్టీండీస్ లో జరిగినా సరే... టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. అలాంటి.. ఉత్కంఠ పోరు జూన్ 9 జరగనుంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐతే.. ఈ మ్యాచ్‌ టిక్కెట్ల ధరలను ఐసీసీ 20వేల డాలర్లుగా నిర్ణయించింది. అంటే సుమారు 16 లక్షలకు పై మాటే. ఈ రెట్లు చూసి చూసి ఇప్పుడు కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులు సైతం ఆశ్చర్యం వ్యకం చేస్తున్నారు.

 

ఇండియా వెర్సస్ పాకిస్థాన్... ఈ టైటిల్ చాలు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ ఊగిపోవడానికి.  ఈ మ్యాచ్ ఇండియాలో జరిగినా.. ఆస్ట్రేలియాలో జరిగినా... ఆఖరికి వెస్టీండీస్ లో జరిగినా సరే... టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఈ దాయదుల పోరును ప్రత్యక్షంగా చూడటానికి లక్షలు ఖర్చు చేయడానికి వెనకడాని ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి.. ఉత్కంఠ పోరు జూన్ 9 జరగనుంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐతే.. ఈ మ్యాచ్‌ టిక్కెట్ల ధరలను ఐసీసీ  20వేల డాలర్లుగా నిర్ణయించింది. అంటే సుమారు 16 లక్షలకు పై మాటే. ఈ రెట్లు చూసి 
చూసి ఇప్పుడు కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులు సైతం ఆశ్చర్యం వ్యకం చేస్తున్నారు. ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోదీ దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నారు.  డైమండ్‌ క్లబ్‌ టికెట్లను 20,000 డాలర్లకు ఐసీసీ విక్రయిస్తోందని తెలిసి షాకయ్యానని... క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ సిరీస్‌ను అమెరికాలో నిర్వహిస్తున్నామని అంతే కానీ... డబ్బులు దండుకోవడాని కాదంటూ ఐసీసీ తీరును తప్పుపడుతూ ఆయన X పోస్ట్ వేశారు. ఆయన ఒక్కరనే కాదు... క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈ రెట్లు చూసి షాకవుతున్నారు. ఈ రెండు జట్ల మధ్య రెగ్యూలర్ సిరీస్ లు జరగట్లేదు కాబట్టి క్రేజ్ ఎక్కువే ఒప్పుకుంటాం కానీ.. ఇలా మరి టూ మచ్ రెట్లు పడితే సామాన్యులు చూడటం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో తొలిసారిగా టోర్ని నిర్వహిస్తోంది అక్కడ లోకల్ గా క్రికెట్ ను విస్తరించడానికి కదా..! ఇంతింత రెట్లు పెడితే అమెరికాలోని నార్మల్ పీపుల్ క్రికెట్ వైపు చూస్తారా..? క్రికెట్ ఆడటానికి ఇష్టపడతారా..? అన్న అనుమానం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ గా మీకేనిపిస్తోంది... ఈ స్థాయి ధరలు చూసి..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram