SRH vs RR Qualifier 2 | IPL 2024 | క్వాలిఫైయర్ 2లో హైదరాబాద్‌తో తలపడనున్న రాజస్థాన్
క్వాలిఫైయర్ 2లో SRHతో తలపడబోయే టీమ్ ఏదో తెలిపోయింది. రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ తో శుక్రవారం పోటీ పడనుంది.
క్వాలిఫైయర్ 2లో SRHతో తలపడబోయే టీమ్ ఏదో తెలిపోయింది. రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ తో శుక్రవారం పోటీ పడనుంది. ఐతే.. క్వాలిఫైయర్ 2 జరుగుతోంది చెన్నై చెపాక్ స్టేడియంలో. ఈ గ్రౌండ్ ఎవరికి హోం గ్రౌండ్ కాదు. సో.. ఇద్దరికి సేమ్ అవకాశాలు ఉంటాయి. కానీ, చెన్నై పిచ్ స్పిన్నర్లకు బాగా కలిసి వస్తుంది. మ్యాచ్ జరిగేకొద్ది పిచ్ స్లోగా అవుతుంది. దీంతో..సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్ కు కష్టమవుతోంది. సో..టాస్ గెలిచిన టీమ్ మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ పిచ్ ను బట్టి చూస్తే SRHలో నాణ్యమైన స్పిన్ బౌలర్ ఎవరు లేదు. షాబాద్ అహ్మద్ ఉన్నా పెద్దగా ఫర్మామెన్స్ చేయట్లేదు. అదే RR లో చూసుకుంటే చెన్నై తంబి అశ్విన్ ఉన్నాడు. ఇంకా మంచి టచ్ లో ఉన్న చాహల్ కూడా ఉన్నాడు. నిన్న ఆర్సీబీ మ్యాచులోనూ కోహ్లీ , గ్రీన్, మ్యాక్స్ వెల వికెట్లు తీసుకుంది వీళ్లిద్దరే. సో.. రేపు జరిగే మ్యాచులో పిచ్ ఏ మాత్రం సహకరించినా వీళ్లద్దరు చెలరేగిపోతారు. ఇంకా సందీప్ శర్మ కూడా స్వింగ్ అండ్ స్లో బాల్స్ వేయగలడు. అలా.. వీళ్లు ముగ్గురి నుంచి SRHకు ఇబ్బంది ఎదురు కావొచ్చు. ఇక బౌల్ట్, అవేశ్ ఖాన్ లు అదనం. SRH లో నట్టుకు ఈ గ్రౌండ్ పై మంచి అవగాహన ఉంది కాబట్టి నటరాజన్ ప్రభావం చూపే అవకాశముంది. భువనేశ్వర్ కుమార్ రాణించే అవకాశం ఉంది. దీంతో... బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఫెవరేట్ గా SRH బరిలోకి దిగుతుంది. స్పిన్ బౌలర్లను ఉతికి ఆరేసే అభిషేక్ శర్మ, ట్రావెస్ హెడ్ లు లపై SRH ఆధారపడి ఉంది. ఇంకా నితిశ్ రెడ్డి, క్లాసెన్ లు కూడా ఆడితే తిరుగు ఉండదు. కంపేర్ టు SRH..RR బ్యాటింగ్ కొంచెం వీక్ గా కనిపిస్తోంది. సంజూ,యశస్వీ రియాన్ పరాగ్ లు సమిష్ఠిగా ఆడుతున్నప్పటికీ దూకుడుగా ఆడట్లేదు. ఇలా.. చెన్నై పిచ్ పై... SRH బ్యాటింగ్ గెలుస్తుందా..? లేదా RR బౌలింగ్ గెలుస్తుందా..? అన్న ప్రెడిక్షన్స్ ఇప్పటి నుంచే మొదలయ్యాయి.