Dinesh karthik Retirement | RR vs RCB Highlights | ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్
మరోసారి కీలకమైన ప్లేఆఫ్స్ లో ఆర్సీబీ నిరాశపరచిన వేళ... క్రికెట్ ఫ్యాన్స్ మరో బ్యాడ్ న్యూస్. టీం ఇండియా స్టార్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. నిన్న రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓడిపోగానే...తను ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు.
మరోసారి కీలకమైన ప్లేఆఫ్స్ లో ఆర్సీబీ నిరాశపరచిన వేళ... క్రికెట్ ఫ్యాన్స్ మరో బ్యాడ్ న్యూస్. టీం ఇండియా స్టార్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. నిన్న రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓడిపోగానే...తను ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ ఐపీఎల్ సీజన్ తరువాత దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. ఇది ఊహించిందే కానీ... ఆర్సీబీ కప్ కొట్టిన గెలుపు క్షణాల్లోకాకుండా ఓటమి తరువాత రిటైర్మెంట్ ప్రకటించడంపై ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మ్యాచ్ ముగిసిన తరువాత ఆర్సీబీ ప్లేయర్లు దినేశ్ కార్తీక్ కు గార్డ్ ఆఫ్ హనర్ ను చూసి దినేశ్ కార్తీకే కంటతడి పెట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ సైతం దినేశ్ కు హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. ఇక.. దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌లో బెంగళూరుతో పాటు కోల్‌కతా, ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్లో కార్తీక్ 15 మ్యాచ్‌లాడి 300కుపైగా పరుగులు చేశాడు.ఓవరాల్ గా ఐపీఎల్ కెరీర్ లో 4842 పరుగులతో టాప్ -10 ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. ఈ సారి మంచి టచ్ లోనే కనిపించిన దినేశ్ కార్తీక్ ను టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అది జరగలేదు. ఒకవేళ అతడు టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ ఐతే.. ఇంకోన్నాళ్లు క్రికెట్ ఆడేవాడేమో. ఏది ఏమైనప్పటికీ.. వచ్చే ఏడాది మెగా వేలం ఉంది. వయసు రీత్యా ఏ జట్టు తీసుకోకపోవడం కంటే ఇలా గౌరవంగా తప్పుకుంటే బెటర్ అని ఫీలయ్యాడేమే దినేశ్ కార్తీక్.. అందుకే ఇలా రిటైర్మెంట్ ప్రకటించాడు.