Shah Rukh Khan Flying kisses Along with KKR Team | హర్షిత్ రానాకు షారూఖ్ ఖాన్ మద్దతు | ABP Desam
కేకేఆర్ టీమ్ తమ ఆటగాళ్లను ఎంత బాగా చూసుకుంటుందో గంభీర్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. కానీ నిన్న లైవ్ లో అందరూ అది తెలుసుకునేలా చేశాడు ఓనర్ షారూఖ్ ఖాన్. మీకు గుర్తుందిగా ఈ ఏడాది కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా వివాదాస్పదమయ్యాడు. ఈ సీజన్ లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్ సన్ రైజర్స్ తో ఆడగా..ఆ మ్యాచ్ లో SRH ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను హర్షిత్ రానా అవుట్ చేశాడు. అయితే వికెట్ తీసిన తర్వాత మయాంక్ కు హర్షిత్ రానా ఫ్లైయింగ్ కిస్ ఇవ్వటం..మయాంక్ దానిపై సీరియస్ అవ్వటం జరిగిపోయాయి. హర్షిత్ రానా మ్యాచ్ ఫీజులో మొదటి తప్పుగా పదిశాతం కోత విధించారు. ఆ తర్వాత మ్యాచుల్లో కూడా హర్షిత్ రానా అలానే వికెట్లు తీసి ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తుండటంతో బీసీసీఐ ఏకంగా అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించింది. నిషేధం తర్వాత తిరిగి వచ్చిన హర్షిత్ రానా ఫ్లైయింగ్ కిస్ లు ఇవ్వటం మానేశాడు. ఇది మనసులో పెట్టుకున్నాడో ఏమో కేకేఆర్ ఓనర్ షారూఖ్ ఖాన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత హర్షిత్ రానా దగ్గరకు వెళ్లాడు. తనను ఎత్తుకోవాలని హర్షిత్ రానాను అడగ్గా హర్షిత్ కు ఏం అర్థం కాలేదు. బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ తమ టీమ్ ఓనర్ షారూఖ్ ఖాన్ అలా అడిగే సరికి షాకైన హర్షిత్ రానా షారూఖ్ ను ఎత్తుకుని విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత టీమ్ మొత్తాన్ని కప్ అందుకున్న తర్వాత నేను వన్ టూ త్రీ అంటానూ మనందరం ఫ్లైయింగ్ కిస్ లు ఇద్దాం అంటూ పెద్ద ప్లానే చేశాడు. నిజంగా నే కప్ అందుకున్న తర్వాత అందరూ కలిసి ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చేలా చేశాడు షారూఖ్ ఖాన్. దీంతో అతను చెప్పాలనుకున్నది ఒక్కటే. ఫ్లైయింగ్ కిస్ ఇవ్వటం నేరమేం కాదు. అదొక సెలబ్రేషన్. దాన్నెందుకు బీసీసీఐ పెద్దది చేసి చూడటం అని..ఇప్పుడు కప్పు గెలిచాం..టీమ్ మొత్తం ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తున్నాం ఏం చేసుకుంటారో చేసుకోండని బీసీసీఐ నిర్ణయాలను మాస్ గా ట్రోల్ చేశాడు. యంగ్ స్టర్ తన టీమ్ మెంబర్ అయిన హర్షిత్ రానాకు టీమ్ మొత్తం అండగా ఉందనే ధైర్యాన్ని ఇచ్చాడు షారూఖ్ ఖాన్.