Rohit Sharma 81 Runs vs GT Eliminator IPL 2025 | సరైన సమయంలో యుద్ధాన్ని నడిపించిన రోహిత్ శర్మ | ABP Desam

 రోహిత్ శర్మ మహారాష్ట్ర ప్రజలు ముంబై చా రాజా రోహిత్ శర్మ అని పిలుస్తారు. అంటే మరాఠీలో ముంబైకి రాజు రోహిత్ శర్మ అని. కానీ రోహిత్ శర్మ తను ముంబైకే కాదు ఇండియా కైనా తనే రాజుని అని ప్రూవ్ చేసుకున్నాడు కూడా. సెల్ఫ్ లెస్ బ్యాటింగ్. ఎంత సెల్ఫ్ లెస్ అంటే తను ఓ కాంపిటీషనలో ఉన్నానని అక్కడ స్టాట్స్ కే ఇంపార్టెన్స్ ఉంటుందని..సెంచరీలు, అర్థసెంచరీలతో మన ప్రతిభను తూకం వేస్తారని కూడా ఆలోచించడు. తన టీమ్ కి తను ఎంత వరకూ ఉపయోగపడతాను.. ప్రత్యర్థులపై తను విరుచుకుపడితే టీమ్ కి ఎంత వరకూ మేలు కలుగుతుంది ఇవి మాత్రమే ఆలోచిస్తాడామో అందుకే కీలకమైన సిరీసుల్లో నాకౌట్ మ్యాచ్ లంటే చాలు రోహిత్ శర్మ చెలరేగిపోతాడు. అది ఇండియాకైనా సరే ఫ్రాంచైజ్ క్రికైటైనా సరే..రోహిత్ బాదుడు అడ్డూ అదుపూ ఉండవు. నిన్న గుజరాత్ టైటాన్స్ పై ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్ ముందు బ్యాటింగ్ చేసింది. గుజరాత్ లాంటి స్ట్రాంగ్ టీమ్ కి ఓ టార్గెట్ సెట్ చేయాలంటే ఏ రేంజ్ లో దూకుడుగా ఆడాలి అదే రేంజ్ లో ఆడాడు రోహిత్ శర్మ. ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న బెయిర్ స్టోను అపోజిట్ లో పెట్టుకుని హిట్ మ్యాన్ తన దైన హిట్టింగ్ తో రెచ్చిపోయాడు. 50 బాల్స్ ఆడి 9 ఫోర్లు 4 సిక్సర్లతో 81పరుగులు చేశాడు. ప్రత్యేకించి ఆ సిక్సర్స్ గురించి మాట్లాడుకోవాలి. అన్నీ పుల్ షాట్సే. తనకి మాత్రమే సాధ్యమయ్యేలా ఇన్నింగ్స్ ను ఏక్సల్రేట్ చేశాడు. బెయిర్ స్టో 47పరుగులు చేసి రోహిత్ కు మంచి సహకారం అందించాడు. హిట్ మ్యాన్ ఆడిన ఈ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ తోనే ముంబై 228 పరుగులు చేసి జీటీ 229పరుగుల టార్గెట్ ఇచ్చి 20 పరుగుల తేడాతో నెగ్గగలిగింది. ఈ ఇన్నింగ్స్ ను చాలా మంది అభిమానులు మొన్న 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ తో పోలుస్తున్నారు. ఆరోజు కూడా రోహిత్ శర్మ 92పరుగులు చేసి ఔటయ్యాడు..టీమిండియాకు వరల్డ్ కప్ ను అందించాడు. నిన్న కూడా అంతే  సెంచరీ కోసం చూసుకోకుండా ఊపేసి ఔట్ అయిపోయిన హిట్ మ్యాన్ సెల్ఫ్ లెస్ బ్యాటింగ్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వరించింది. ఐపీఎల్ లో ఓ మ్యాచ్ లో ప్లేయర్ ది మ్యాచ్ అందుకోవటం రోహిత్ కు 22వసారి..తన తర్వాతే కొహ్లీ, ధోనీ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ లో రోహిత్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola