Hardik Pandya Shubman Gill Ego Clash GT vs MI | IPL 2025 ఎలిమినేటర్ మ్యాచ్ తో కొత్త శత్రువులు | ABP Desam

 ఐపీఎల్ అంటేనే అంత. కాంపిటీషన్ హై లెవల్లో ఉండే గేమ్. పైగా ఒకే జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడతారు కాబట్టి ఒక్కోసారి మనకు బాగా కావాల్సిన వాళ్ల మీద తెలియకుండానే కోపం కసి వచ్చేస్తాయి. అలా ఈ ఏడాది ఐపీఎల్ ఇద్దరు శత్రువులను తయారు చేసిందా. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. ఈ ఇద్దరికీ ఇప్పుడు పడటం లేదంటూ నిన్న మ్యాచ్ లో జరిగిన ఘటనలను వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. మ్యాటర్ ఏంటంటే నిన్న ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా ముంబై, గుజరాత్ కెప్టెన్లు ఇద్దరూ టాస్ కి వచ్చారు. టాస్ ముంబైకెప్టెన్ పాండ్యా గెలిచాడు. ఇది నచ్చలేదో ఏమో జనరల్ గా టాస్ ఎవరూ గెలిచినా మాట్లాడటానికి వెళ్లే వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వటం అనేది ఆనవాయితీ . కానీ నిన్న షేక్ హ్యాండ్ ఇవ్వలేదు శుభ్ మాన్ గిల్. పాండ్యా షేక్ హ్యాండ్ ఇద్దామని చేయి లేపేందుకు చూస్తున్నా గిల్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించకపోవటంతో హర్ట్ అయ్యాడు పాండ్యా. అది మనసులో పెట్టుకున్నాడేమో ఛేజింగ్ టైమ్ లో గిల్ మొదటి ఓవర్ లోనే ఔట్ కాగానే గిల్ పక్కకు వచ్చి పెద్దగా అరుస్తూ ఏదో అన్నాడు పాండ్యా. గిల్ కూడా సీరియస్ గా చూశాడు. ఈ సీజన్ అంతా అద్భుతంగా ఆడి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకూ టేబుల్ టాపర్ గా కూడా ఉన్నా గుజరాత్ టైటాన్స్ అనూహ్యంగా ఎలిమినేటర్ లో ఓడి ఎలిమినేట్ అయిపోయింది. మరి ఆ కోపం కసితో అలా ప్రవర్తించాడో ఏమో తెలియదు కానీ మ్యాచ్ లో కామేంటేటర్లు కూడా వీళ్లిద్దరి మధ్య జరిగిన సీన్స్ ని చూపిస్తూ మినీ రైవల్రీ అన్నారు. ఒకప్పుడు పాండ్యా గుజరాత్ టైటాన్స్ కే కెప్టెన్ కాగా. ఓ సారి విజేతగా, ఓ సారి రన్నరప్ గా తను ఆడిన రెండు సీజన్స్ లోనూ జీటీ ని ఎక్కడికో తీసుకెళ్లాడు పాండ్యా. గిల్ కెప్టెన్ అయ్యాక ఆ స్థాయిలో గుజరాత్ ఫర్ ఫార్మెన్స్ ఇస్తున్నా నాకౌట్స్ లో తడబడిపోతోంది. చూడాలి మరి టెస్టు క్రికెట్ కి కొత్త కెప్టెన్ గా ఎంపికైన గిల్ కి, టీ20 టీమ్ మాజీ కెప్టెన్, టీమిండియా వైట్ బాల్ క్రికెట్ లో కీలక సభ్యుడైన హార్దిక్ పాండ్యా మొదలైన ఈ గొడవ ఐపీఎల్ లో తో ఆగిపోతుందా..లేదా ఆ ఇగో క్లాషెస్ కంటిన్యూ అవుతాయా చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola