RCB vs PBKS IPL 2025 Final Teams Review | ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలంటే వీళ్లు ఆడాల్సిందే
ఈ ఐపీఎల్ సీజన్ లో అన్ క్యాప్డ్ ఆటగాళ్లతోనే అద్భుతాలు చేసింది పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆరుగురు అన్ క్యాప్డ్ ఆటగాళ్లు టీమ్ లో కీలకపాత్ర పోషిస్తూ మరే జట్టుకు లేని విధంగా విజయాలను అందించారు. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభ్ సిమ్రన్ 4 హాఫ్ సెంచరీలతో ఈ సీజన్ లో 523 పరుగులు చేస్తే...రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో ప్రియాంశ్ ఆర్య మొదటి సీజన్ లోనే 451పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ఓపెనింగ్ గా బలంగా మార్చుకున్న పంజాబ్..అయ్యర్ అద్భుతమైన ఆటతో నెక్ట్స్ లెవల్ కి వెళ్తోంది. అయ్యర్ ఆరు హాఫ్ సెంచరీలతో 603 పరుగులు చేసి పరుగుల వీరుల జాబితాలో కొహ్లీ వెనకాలే ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో మరో ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్స్ నేహల్ వధేరా, శశాంక్ సింగ్ పంజాబ్ కి కొండంత అండగా నిలుస్తున్నారు. బౌలింగ్ విభాగంలో అర్ష్ దీప్, చాహల్ కి తోడుగా అన్ క్యాప్డ్ ప్లేయర్లు హర్ ప్రీత్ బ్రార్, విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్ భారాన్ని పంచుకుంటున్నారు.ఇలా ఆరుగురు అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఆడుతూ జట్టును ఫైనల్ కి తీసుకువచ్చింది బహుశా చరిత్రలో పంజాబ్ మాత్రమేనేమో. మరో వైపు ఆర్సీబీకి మోటో, వాళ్ల లక్ష్యం కొహ్లీ కప్ గెలిచి గిఫ్ట్ ఇవ్వటం అంతే. కొహ్లీ తోడుగా ఫిల్ సాల్ట్ చెలరేగుతుంటే...రజత్ పటీదార్, జితేశ్ శర్మ అవసరమైనప్పుడల్లా ఆర్సీబీకి అండగా నిలబడ్డారు. గాయం నుంచి కోలుకుని టిమ్ డేవిడ్ ఆడితే అది ఆర్సీబీకి మరింత అడ్వాంటేజ్ కానుంది. బౌలింగ్ లో జోష్ హేజిల్ వుడ్, భువీ, యశ్ దయాల్ పేస్ తో నిప్పులు చెరుగుతుంటే..స్పిన్ లో సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా అవసమరైనప్పుడల్లా వికెట్లు తీసి ఆర్సీబీని ఫైనల్ వరకూ తీసుకువచ్చారు. సో ముందు నుంచి ఉన్నట్లు అటు పంజాబ్ అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఆడితే పంజాబ్ కప్ కొట్టేయటం ఖాయం...ఇటు ఆర్సీబీ బలమైన బౌలర్లు చెలరేగితే పాటిదార్ సేన 18ఏళ్ల కల తీర్చుకోవటం ఖాయం.