RCB Top 2 Playoffs Scenario IPL 2025 | చెన్నై, ముంబై విజయం కోసం RCB ప్రార్థనలు | ABP Desam
ధోనీ, రోహిత్ శర్మ గెలవాలని కొహ్లీ పూజలు చేయటం అని మీరు కంగారు పడొచ్చు. కానీ నిజంగా జరుగుతున్నది అదే. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు కన్ఫర్మ్ అయిపోయాయి. కానీ ఇప్పుడు టీమ్స్ తలపడుతున్నదల్లా టాప్ 2 లో నిలిచి ప్లే ఆఫ్స్ కి వెళ్లే జట్లు ఏవనే. రీజన్ మీకు తెలుసు టాప్ 2 లో ఉంటే ప్లే ఆఫ్స్ 1 ఓడిపోయినా ప్లే ఆఫ్స్ 2 కి ఆడి గెలిచి ఫైనల్ కి వెళ్లగలిగే సెకండ్ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్సీబీ ధోనీ, రోహిత్ గెలవాలని కోరుకోవటం వెనుక ఇదే రీజన్ ఉంది. ఈరోజు రాత్రికి చెన్నైకి, గుజరాత్ కి మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే 20 పాయింట్ల సాధించి టాప్ 1 జట్టుగా ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతుంది. అందుకే గుజరాత్ ను ఓడించేందుకు ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ కొట్టాలని RCB ఫ్యాన్స్ కోరుకోక తప్పుదు. స్టేడియంలో, ఇళ్లలో టీవీల ముందు చెన్నై కి ఇవాళ ఆర్సీబీ ఫ్యాన్స్ సపోర్ట్ చేయకతప్పదు. అప్పుడు గుజరాత్ ఇదే 18 పాయింట్లతో ఉంటుంది. ఇక రెండోది ముంబై ఇండియన్స్ మ్యాచ్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కి MI తో మ్యాచ్ ఉంది. పంజాబ్ కి ఇప్పుడు ఆర్సీబీలానే 17 పాయింట్లు ఉన్నాయి. పంజాబ్ MI ని ఓడిస్తే చాలు 19 పాయింట్లు అవుతాయి కాబట్టి టాప్ 2 లో ప్లేస్ పక్కా. కానీ అలా జరగుకుండా ఉండాలంటే రోహిత్ శర్మ లాంటి లెజండరీ ప్లేయర్ ఉన్న MI గెలవాలని RCB ప్రార్థనలు చేయాలి. అప్పుడు MI కి 18 పాయింట్లు వస్తాయి. కొహ్లీ ఆయన అభిమానులు ప్రార్థనలు ఫలించి ధోనీ, రోహిత్ జట్లు గెలిచినా కొహ్లీ RCB తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో LSG మీద విజయం సాధించాలి అప్పుడే 19 పాయింట్లతో సాధించిన RCB, 18 పాయింట్లున్న ముంబై, గుజరాత్ లో ఏది మెరుగైన రన్ రేట్ ఉందో అది టాప్ 2 కన్ఫర్మ్ చేసుకుంటాయి. లేదంటే ధోనీ,రోహిత్ ఇవాళ రేపు గెలిచినా RCB గెలవకపోతే గుజరాత్, ముంబై జట్లు చెరో 18 పాయింట్లున్నాయి కాబట్టి టాప్ 2 గా సీజన్ ముగించి ప్లే ఆఫ్స్ 1 ఆడుకుంటాయి. సో అదన్నమాట సినారియో టేబుల్.