GT vs CSK Match Preview IPL 2025 | మిగిలిన టీమ్స్ స్ఫూర్తిగా గుజరాత్ కి షాక్ ఇవ్వాలని చెన్నై | ABP Desam

Continues below advertisement

 ఈసారి ఐపీఎల్  సీజన్ లో ఎలిమినేట్ అయిపోయిన జట్లన్నీ..ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోయిన జట్లకు షాక్ లు ఇస్తున్నాయి. టాప్ 2 లో ఉండనివ్వకుండా మ్యాచ్ లను ఓడిస్తూ తెగ ఇబ్బంది పడుతున్నాయి. ఆ వరుసలో ఇవాళ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై ప్రస్తుతానికి టాప్ 1 గా ఉన్న గుజరాత్ టైటాన్స్ కి...ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిపోయి స్టార్టింగ్ నుంచి పదో ప్లేస్ తనదేనని పక్కేసుకుని పడుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కి మ్యాచ్ ఈ రోజు. ఈ రెండు జట్లకు ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా గుజరాత్ కి టాప్ 2 లో ప్లే ఆఫ్స్ కి వెళ్లటానికి ఈ మ్యాచ్ కీలకం. ఓడిపోతే టాప్ 2 లో వెళ్లే ఛాన్స్ ఉండదు అని కాదు కానీ కచ్చితంగా ఉండాలంటే ఇవాళ మ్యాచ్ గెలుచుకోవటం గుజరాత్ కి అవసరం. కానీ టెస్ట్ క్రికెట్ కి కొత్త కెప్టెన్ గా ఎన్నికైన గుజరాత్ టైటాన్స్ కి శుభ్ మన్ గిల్ కు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చెన్నై కి ఈ మ్యాచ్ ఓడిపోయినా పోయేదేం లేదు పైగా లాస్ట్ లీగ్ మ్యాచ్. సో ఫుల్ టూ ఓపెన్ అయిపోయి ఫ్రీగా ఆడుకునే ఛాన్స్ సీఎస్కేకి ఉంది. కానీ గుజరాత్ అలా కాదు. ఒత్తిడిలో ఆడాల్సి ఉంటుంది. టీమ్స్ బలాబలాలు చూసుకుంటే గుజరాత్ ఓపెనర్లే వాళ్లకు కొండంత అండ. ఓపెనర్ సాయి సుదర్శన్, గిల్ ల కాంబినేషన్ ను కొట్టే బౌలింగ్ లైనపే ఈ సీజన్ లో ఏ టీమ్ కీ దొరకలేదు. అందుకే గుజరాత్ టాప్ పొజిషన్ లో నిలబడగలిగింది. ఏదైనా తడబాటు అయితే ఆదుకోవటానికి బట్లర్, మొన్ననే హాఫ్ సెంచరీ బాదిన షారూఖ్ ఖాన్ ఉన్నారు. ఇక బౌలింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ ఎవ్వరికీ ఇవ్వనంటున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటికే 21 వికెట్లు సాధించిన ప్రసిద్ధ్...ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కు ఎంపికైన జోష్ చూపించే అవకాశం కూడా ఉంది. ప్రసిద్ధ్ తోడుగా రబాడా, రషీద్ ఖాన్ గుజరాత్ కి కొండంత అండ కాగా...చెన్నై మొత్తం యంగ్ స్టర్స్ నే మళ్లీ నమ్ముకోనుంది. ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రూయిస్ ఎలా ఆడతారు అనే దాన్ని బట్టే చెన్నై స్కోరు డిపెండ్ కానుంది. దేశవాళ్లీలో దుమ్మురేపిన ఉర్విల్ పటేల్ కూడా ప్రూవ్ చేసుకుంటే నెక్ట్స్ సీజన్ లో పర్మినెంట్ ప్లేస్ పక్కా. సీనియర్లు డెవాన్ కాన్వే, జడేజా, దూబే, ధోనీ తలో చేయి వేస్తే గుజరాత్ కి షాక్ తప్పదు. ఈ సీజన్ లో సీఎస్కే బౌలింగ్ ను ముందుండి నడిపించిన కుర్ర ఆఫ్గాన్ బౌలర్ నూర్ అహ్మద్ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. మొత్తంగా చెన్నై గెలిస్తే మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న ట్రెండ్ ను ధోని కూడా కంటిన్యూ చేసినట్లు అవుతుంది. గుజరాత్ గెలిస్తే టాప్ 2 ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుని దర్జాగా ప్లేఆఫ్ 1 ఆడుకోవటానికి సిద్ధమైపోతుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola