Prithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP Desam

 క్వింటాళ్ల క్వింటాళ్ల టాలెంట్ తో పాటు క్రమశిక్షణ కూడా ఉండటం మనిషికి చాలా అవసరం అంటారు కదా దానికి సరైన ఉదాహరణనే పృథ్వీషా. 2018 అండర్ 19 వరల్డ్ కప్ తర్వాత మరో సచిన్ టెండూల్కర్ అవుతాడనే స్థాయి పేరు సంపాదించిన పృథ్వీషా చిన్నప్పటి నుంచి తనకు క్రికెట్ అంటే ఉన్న కసి..ఆడిన సుదీర్ఘమైన ఇన్నింగ్స్ లు..బద్ధలు కొట్టిన రికార్డులతో 19ఏళ్లకే టీమిండియా తలుపు తట్టారు. సచిన్, సెహ్వాగ్ తో పోలికలు... ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ బాది అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ 6 ఏళ్ల తర్వాత అదే కుర్రాడు ఐపీఎల్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కనీసం బేస్ ప్రైస్ అంటే తనకున్న 75లక్షల ధరకు కూడా తనను తీసుకోవటానికి ఏ టీమ్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. 2018 ఆస్ట్రేలియా టూర్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన పృథ్వీషా మళ్లీ టీమిండియాలోకి రాలేదు. డోపింగ్ టెస్ట్ లో దొరకటం....బయట యూట్యూబర్ తో గొడవలు..తాగి బండి నడపటం...ఒకటేంటీ టీనేజ్ లోనే తన కెరీర్ ను తనే చేతులారా పాడు చేసుకున్నాడు.  23 ఏళ్ల వయసుకు వచ్చేసరికి బాల్ హెడ్ తో... ఫిట్నెస్ కోల్పోయి ఊహించలేని రీతిలో మారిపోయాడు.....తనకు ముందు నుంచి అవకాశాలు కల్పిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు కూడా భారమైపోయాడు. అందుకే మొన్న రిటెన్షన్ అప్పుడే ఫస్ట్ టైమ్ పృథ్వీ షాను వదిలించుకుంది డీసీ. నిన్న ఆక్షన్ లో తనను ఎవ్వరూ తీసుకోవాలని అనుకోలేదు కూడా. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. కైఫ్ అయితే చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేశాడు పృథ్వీ షా పై. తనకున్న టాలెంట్ కి తను తన లైఫ్ ను నాశనం చేసుకుంటున్న తీరుకు పృథ్వీ షా సిగ్గుపడాలని చెప్పాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదని ఫిట్నెస్ పై దృష్టిసారించి దేశవాళీల్లో రాణిస్తే సర్ఫరాజ్ లా మళ్లీ టీమిండియాకు ఆడొచ్చనే ఆఖరి సలహా ఇస్తున్నానన్నాడు కైఫ్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola