MS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

Continues below advertisement

  తలా ధోనీ ప్లాన్ చేస్తే ఏదీ చిన్నగా ఉండదు కదా..ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఠక్కున గుర్తొచ్చేది ధోనినే. తన టీమ్ తో అంతలా బంధాన్ని పెనవేసుకుని 2008 మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకూ ఒకే టీమ్ లో ఉంటూ ఆడుతూ ఇప్పుడు తన 43వ ఏట మళ్లీ ఐపీఎల్ ఆడటానికి రెడీ అయిపోతున్నాడు ధోని. అయితే గడచిన రెండేళ్లుగా సీఎస్కే టీమ్ లో చిన్న డిస్ట్రబెన్సెస్ ఉన్నాయి. 2023 ఐపీఎల్ విన్నర్ గా నిలిచిన ధోని..ఇక వీడ్కోలు చెప్పే ప్రయత్నాలు ప్రారంభించాడు. అందులో భాగంగానే కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కి ఇచ్చేశాడు. అంతకు ముందే జడేజాను కెప్టెన్ చేసే ప్రయత్నాలు కూడా చేశాడు. అది కూడా వర్కవుట్ అవ్వలేదు. పైగా లాస్ట్ సీజన్ లో సీఎస్కే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి ఐదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే రూట్ మార్చిన ధోని...ఐపీఎల్ మెగా వేలంలో తన పాత మిత్రులందరినీ మళ్లీ సీఎస్కేకు రప్పించాడు. రాజస్థాన్ కి ఆడుకుంటున్న అశ్విన్ ని 9కోట్ల 75లక్షలకు కొనుక్కుంది చెన్నై సూపర్ కింగ్స్. లోయల్టీ మేటర్. పంజాబ్ లో ఆడుకుంటున్న కడైకుట్టి సింగం శామ్ కర్రన్ ను 2కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది. కర్రన్ కూడా సీఎస్కేనే గతంలో. సో వీక్ గా ఉన్న బౌలింగ్ ని స్ట్రాంగ్ చేసుకుంది. టీమ్ లో ఆల్ రౌండర్లు గట్టిగా ఉండేలా ప్లాన్ చేసింది. రచిన్ రవీంద్ర, అశ్విన్, శామ్ కర్రన్, రవీంద్ర జడేజా, దీపక్ హుడా లెక్కకు మించినంత మంది ఆల్ రౌండర్లు ఉన్నారీసారి. మరోసారి న్యూజిలాండ్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేలకే ఓపెనర్లుగా ఛాన్స్. పేస్ అటాక్ చూసుకోవటానికి పతిరానాతో పాటు దేశవాళీల్లో అదరగొడుతున్న ముకేశ్ చౌదరి, అన్షుల్ కాంభోజ్ లకు ఛాన్స్ ఇచ్చింది. పాత ప్లేయర్లను తిరిగి తెచ్చుకోవటంతో...భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని యంగ్ పేసర్లను తీసుకోవటం తో రానున్న ఐదేళ్లకు సరిపడా కోర్ టీమ్ ను ప్లాన్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ధోని, అశ్విన్, రవీంద్ర జడేజా చాలా ఏళ్లుగా సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఈ ముగ్గురూ చెన్నైతోనే  ఐపీఎల్ కు స్వస్తి చెప్పే ప్లాన్ తో పాటు...రుతురాజ్ గైక్వాడ్ లీడర్ షిప్ లో ఫ్యూచర్ లో చెన్నై నడిపించే టీమ్ ను రూపొందించేలా ధోని గైడెన్స్ లో ఆక్షన్ స్ట్రాటజీ ఫాలో అయ్యింది చెన్నై సూపర్ కింగ్స్. మరి ఫర్ ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలంటే నెక్ట్స్ ఇయర్ సమ్మర్ వరకూ ఆగాల్సిందే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram