Preity Zinta hopes First Title RCB vs PBKS IPL 2025 Final | తొలి కప్ కల కోసం ప్రీతి జింతా
సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లు జరిగేప్పుడు ఓనర్ కావ్యా మారన్ చాలా వైరల్ అవుతుంటారు. గేమ్ కోసం ఆమె పడే టెన్షన్ మ్యాచ్ లో అందరూ ఫీల్ అయ్యేలా చేస్తుంటారు. గెలుపు ఓటమలు సహజమే అయినా ఎప్పుడూ గెలుపు కోసమే పరితపించే యాజమాన్యాలు ఆటపై చూపించే డెడికేషన్ దాని చుట్టూ ముడి పడి ఉన్న వందలు వేలకోట్ల వ్యాపారం ఇలా ఎన్నో రీజన్స్ ఉంటాయి వాళ్ల టెన్షన్స్ కి. మరి అలాంటి 18ఏళ్లుగా పడుతోంది ప్రీతి జింతా. 18ఏళ్లుగా పంజాబ్ జట్టును నడిపిస్తూ ఒక్క కప్ సాధించాలనే తపనతో రగిలిపోతోంది ప్రీతి. వాస్తవానికి లోకల్ ప్లేయర్లను ఎక్కువగా ప్రమోట్ చేసి వాళ్లకంటూ ఓ క్రికెటింగ్ కెరీర్ ను ఏర్పరచటంలో పంజాబ్ ముందు నుంచి కీలకపాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది కూడా చూడండి ఏ జట్టూ ఆడించినట్లుగా 6 గురు అన్ క్యాప్డ్ ప్లేయర్లతో అద్భుతాలు సృష్టిస్తోంది పంజాబ్. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్, శశాంక్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్ ఇలా స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వాళ్లతో అద్భుతాలు చేయించటంలో ప్రీతి జింతా తీసుకుంటున్న నిర్ణయాలు కీలకం. తన సహచర యజమానులైన నెస్ వాడియా, మోహిత్ బర్మన్ ల నుంచి ప్రీతి జట్టు యాజమాన్యం విషయంలో చాలా తలనొప్పులు, కోర్టు కేసులు ఉన్నాయి. అయినా తన యాక్టింగ్ కెరీర్ ను పక్కన పెట్టి 18ఏళ్లుగా పూర్తిగా తనకు క్రికెట్ పై ఉన్న ఇంట్రెస్ట్ మాత్రమే ఇక్కడ వందల కోట్ల డబ్బును ఇన్వెస్ట్ చేశారు ప్రీతి జింతా. ఎన్నో జట్లు యాజమాన్యాలు చేతులు మారినా ప్రీతి జింతా మాత్రం ఒక్క గెలుపు లేకపోయినా సరే తన టీమ్ ను ఇన్నేళ్లుగా వదిలిపెట్టలేదు. మరి ఈరోజు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ టీమ్ తొలిసారిగా కప్పు సాధించి ప్రీతి ఇన్నేళ్ల కలను తీరుస్తారేమో చూడాలి.