Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ. ఈరోజు వరకూ ఈ దేశవాళీ క్రికెటర్ల గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. కానీ అబుదాబీలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఈ ఇద్దరి పేర్లు చదివి నోరు వెళ్లబెట్టింది. దీనికి రీజన్ ఈ ఇద్దరు ఆటగాళ్లపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అక్షరాలా 28కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ మాత్రమే ఉన్న ఈ ఇద్దరు యువ ఆటగాళ్లపై చెన్నై చెరో 14 కోట్ల 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ వేలంలో దక్కించుకోవటంతో 19ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం దక్కించుకున్న తొలి అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా ఈ ఇద్దరూ రికార్డు నెలకొల్పారు. ఫలితంగా ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ అని ఇప్పుడంతా ఇంటర్నెట్ లో వెతికేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని అమేథీకి చెందిన ఆల్ రౌండ్ ప్రశాంత్ రామేంద్ర వీర్ వయస్సు 20 సంవత్సరాలు. ఈ ఏడాది జరిగిన యూపీ టీ20 లీగ్ లో నోయిడా సూపర్ కింగ్స్ తరపున ఆడిన ప్రశాంత్ వీర్ లోయర్ మిడిల్ ఆర్డర్ లో 12 మ్యాచుల్లో 167 స్ట్రైక్ రేట్ తో 112 పరుగులు చేశాడు. తొమ్మిది మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా వదిలివెళ్లిన ప్లేస్ ను భర్తీ చేయాలని ఆలోచనల్లో ఉన్న సీఎస్కే ఈ కుర్రాడిపై నమ్మకం పెట్టుకుంది.
మరో కుర్రాడు కార్తీక్ శర్మది రాజస్థాన్. వికెట్ కీపర్ లోయర్ బ్యాటర్ అయిన కార్తీక్ శర్మ వయస్సు 19 సంవత్సరాలు. లోయర్ మిడిల్ ఆర్డర్ లో హిట్టర్ గా పేరుతెచ్చుకున్న కార్తీక్ శర్మ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్ స్టేజ్ లో ఐదు మ్యాచుల్లో 160 స్ట్రైక్ రేట్ తో 133 పరుగులు చేశాడు. 12 టీ20 మ్యాచులు తన కెరీర్ లో ఆడిన కార్తీక్ శర్మ స్టైక్ రేట్ 160కి తగ్గకపోవటంతో సీఎస్కే దృష్టి ఈ యంగ్ స్టర్ పై పడింది. MSD తరహాలో వికెట్ కీపర్ ఇంకా భారీ హిట్టింగ్ క్యాపబులిటీ ఉన్న ఈ ప్లేయర్ ను గ్రూమ్ చేయాలనే ఉద్దేశంతోనే ఏకంగా 14కోట్ల 20 లక్షలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది.