Cameron Green IPL Auction 2026 | ఆసీస్ ఆల్ రౌండర్ కు ఐపీఎల్ వేలంలో ఊహించని జాక్ పాట్ | ABP Desam
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్ కేమరూన్ గ్రీన్ భారీ జాక్ పాట్ కొట్టేశాడు. 19ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో లేని విధంగా ఏకంగా 25 కోట్ల 20 లక్షల రూపాయలకు కేమరూన్ గ్రీన్ అమ్ముడుపోయాడు. ఇంత భారీ మొత్తం పెట్టి అబుదాబీలో జరిగిన ఐపీఎల్ మినీవేలంలో గ్రీన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కేమరూన్ గ్రీన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2023, 2024 సీజన్లలో ఐపీఎల్ లో RCB కి ఆడిన గ్రీన్...2025 ఐపీఎల్ కు గాయం కారణంగా దూరయమ్యాయడు. కానీ ఊహించని స్థాయిలో గ్రీన్ లో 25 కోట్ల 20 లక్షలకు కేకేఆర్ దక్కించుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ లో ఆడిన రెండు సీజన్లలో 707 పరుగులు చేసిన గ్రీన్ 16 వికెట్లు తీసి ఆలౌ రౌండర్ కు బాగానే ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తంగా కేమరూన్ గ్రీన్ కు భారీ ధర పలకటంతో ఈ సారి ఐపీఎల్ మరింత ఆసక్తికరం కానుంది.