PBKS vs RCB Qualifier 1 Preview IPL 2025 | క్వాలిఫైయర్ 1 లో గెలిచి ఫైనల్ లో నిలిచేదెవరో.? | ABP Desam
ఈ సీజన్ లో పంజాబ్ బాగా ఆడిందా..ఆర్సీబీ బాగా ఆడిందా అంటే చెప్పటం కష్టం. రెండు జట్లు కూడా స్ఫూర్తిదాయకమైన విజయాలతో క్వాలిఫైయర్ 1 వరకూ వచ్చేశాయి. ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ లో ఆడని మ్యాచుల్లో వరుసగా 7విజయాలు సాధించి ఈ ఐపీఎల్ లో చరిత్ర సృష్టిస్తే..చిన్న చిన్న స్కోర్లను కూడా కాపాడుకుని అన్ క్యాప్డ్ ప్లేయర్లతోనే అద్భుతాలు చేసి ఐపీఎల్ క్వాలిఫైయర్ 1కి దూసుకొచ్చింది పంజాబ్ కింగ్స్. టెక్నికల్ గా మాట్లాడుకుంటే లీగ్ స్టేజ్ లో టేబుల్ టాపర్ గా ఉన్న పంజాబ్ కి ఆర్సీబీతో పోలిస్తే ఇప్పటికీ ఎడిషనల్ అడ్వాటేంజెస్ కూడా ఉన్నాయి. క్వాలిఫైయర్ 1 లో ఈరోజు రాత్రికి తలపడే ఈ రెండు జట్ల బలాబలాలు చూస్తే మాత్రం ఆర్సీబీ అండ దండ కొండంత బలం అన్నీ కింగ్ విరాట్ కొహ్లీనే. ఈ సీజన్ లో 8 హాఫ్ సెంచరీలతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు నెలకొల్పిన ఆటగాడిగా విరాట్ కొహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే సీజన్ లో 602 పరుగులు చేసిన విరాట్ ఓ ఐపీఎల్ సీజన్ లో 600లకు పైగా పరుగులు చేయటం కూడా ఐదోసారి. సో తన ఫామ్ ఆర్సీబీకి ప్రధాన బలం కాగా...గాయంతో బాధపడుతున్న రజత్ పాటిదార్ లో రెండు మ్యాచుల నుంచి స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్న జితేశ్ శర్మ గత మ్యాచ్ లో LSG పై ఆడిన తీరు నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫర్. మిడిల్ ఆర్డర్ లో జితేశ్ సృష్టించిన విధ్వంసంతోనే ఈరోజు ఆర్సీబీ క్వాలిఫైయర్ 1 ఆడగలుగుతోంది. కొహ్లీ కాకుండా మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ సూపర్ గా సపోర్ట్ ఇస్తున్నాడు. రజత్ పాటిదార్ కూడా లైన్లోకి వచ్చేస్తే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ బలంగా మారిపోతుంది. బౌలర్లలో ఈ సీజన్ లో 18వికెట్లు తీసిన జోష్ హేజిల్ వుడ్ తిరిగి రావటం ఆర్సీబీలో ఆశలు రేపుతుండగా...యశ్ దయాల్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా పంజాబ్ ను ఎంత వరకూ కట్టడి చేస్తారో చూడాలి. ఇక పంజాబ్ విషయానికి వస్తే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్ ఫీల్డ్ లో, కోచ్ రికీ పాంటింగ్ గ్రౌండ్ బయట రచిస్తున్న వ్యూహాలు పంజాబ్ ను ఈ సీజన్ లో ఇంత స్ట్రాంగ్ గా నిలబెట్టాయి. అన్ క్యాప్డ్ ప్లేయర్లే పంజాబ్ కి కొండంత బలం. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఈ సీజన్ లో దుమ్ము రేపారు. ప్రభ్ సిమ్రన్ 499పరుగులు చేస్తే..ప్రియాంశ్ 420 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదరహో అనిపిస్తున్నాడు. 514 పరుగులతో పంజాబ్ తరపున హయ్యెస్ట్ స్కోరర్ గా ఉన్న శ్రేయస్ ఈ రోజు ఆర్సీబీపై చెలరేగితే మాత్రం బెంగుళూరుకు ఇక అంతే సంగతులు. మిడిల్ ఆర్డర్ లో వధేరా, లోయర్ మిడిల్ ఆర్డర్ లో శశాంక్ సింగ్ ను పంజాబ్ బలంగా నమ్ముతోంది. స్టాయినిస్ కూడా మొన్న మ్యాచ్ లో ఫామ్ లోకి రావటంతో పంజాబ్ ఫుల్ హ్యాపీ స్. బౌలింగ్ లో మార్కో యాన్సన్ నేషనల్ డ్యూటీ కోసం సౌతాఫ్రికాకు వెళ్లిపోవటం పంజాబ్ కు పెద్ద ఎదురుదెబ్బ. ఆల్ రౌండర్ అయిన తను బ్యాటింగ్ లో ఉపయోగపడే వాడు. తన ప్లేస్ లో ఇక అజ్మతుల్లా ఒమర్జాయ్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. గాయంతో రెండు మ్యాచ్ లు ఆడలేకపోయిన చాహల్ ఈ మ్యాచ్ లో తిరిగి వస్తాడు. సీజన్ లో 18 వికెట్లు తీసిన అర్ష్ దీప్ సింగ్ పంజాబ్ బౌలింగ్ కు ప్రధాన బలం. చూడాలి ఈ రోజు మ్యాచ్ లో విరాట్ కొహ్లీ అయ్యారే కొహ్లీ అనిపిస్తాడో...శ్రేయస్ తన విరాట్ రూపాన్ని ప్రదర్శించి ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడో.